Kashmiri Pandits: వివేక్‌ అగ్నిహోత్రి డైరెక్ట్‌ చేసిన కాశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కర్ణాటకలోని ఓ విద్యాసంస్థ సేవా ధృక్ఫథాన్ని చాటుకుంది. కశ్మీర్‌ పండిట్ల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించింది. కశ్మీర్‌ నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారి పిల్లలకు ఈ అవకాశం కల్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ది కాశ్మీర్ ఫైల్స్. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో  వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. 90వ సంవత్సరంలో జరిగిన మారణహోమానికి తన ఫ్యామిలీని
కోల్పోయిన కాశ్మీరీ పండిట్ కుటుంబం జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  ఈ చిత్ర బృందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అటు కొందరు మాత్రం ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తాజాగా కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని నట్టోజ ఫౌండేషన్‌  కార్యదర్శి సుబ్రమణ్య నట్టొజ స్ఫూర్తిగా తీసుకున్నాడు. కశ్మీర్‌ పండిట్ల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటన చేశాడు.


దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తురు టౌన్‌ లో ఉన్న అంబికా మహావిద్యాలయానికి సుబ్రమణ్య నట్టొజ కార్యదర్శిగా ఉన్నాడు. కశ్మీర్‌ పండిట్ల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని శనివారం ఆయన ప్రకటించారు. ఈ విద్యాసంస్థలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందివ్వనున్నారు. అంతేకాదు విద్యార్థులు ఉండేందుకు ఉచితంగా హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. అటు ఇప్పటికే అంబికా మహావిద్యాలయంలో నలుగురు కశ్మీర్‌పండిట్లు అడ్మిషన్‌ తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ విద్యాసంస్థలో చదువుకోవాలంటే ఒక్కో విద్యార్థికి కనీసం సంవత్సరానికి 80 వేలు ఖర్చు అవుద్ది. అటు ఇతర సౌకర్యాల కోసం దాదాపుగా మరో 50 వేల వరకు ఖర్చు వస్తది. కశ్మీర్‌ పండిట్ల పిల్లల కోసం ఈ ఖర్చంతా తామే భరిస్తామని సుబ్రమణ్య నట్టొజ ప్రకటించారు.  మొత్తానికి విద్యను ఉచితంగా అందించాలనే ఆయన ఆలోచనను అందరూ కూడా సమర్థిస్తున్నారు. అయితే కేవలం కశ్మీర్‌ పండిట్ల విద్యార్థులకే ఈ అవకాశం ఇవ్వడమేంటనీ పలువురు ప్రశ్నిస్తున్నారు.


Also Read: NBK 107 Title: బాల‌కృష్ణ తదుపరి సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. ఇక అభిమానులకు పూనకాలే!


Also Read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.