Drunk Passenger Urinated In Flight: ఇటీవల తోటి ప్రయాణికులపై మద్యం మత్తులో మూత్ర పోసిన ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే జవాన్లు అరెస్ట్ చేశారు. ఈ  సంఘటన AA292 అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగింది. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి బయలుదేరింది. విమానంలో అమెరికాలోని ఓ యూనివర్శిటీ విద్యార్థి మద్యం తాగి నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో నిద్రమత్తులో మూత్ర విసర్జన చేశాడు. మూత్ర బయటకుపోయి తోటి ప్రయాణికుడిపై పడ్డాయి. దీంతో ఆయన విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అయితే మూత్రం పోసిన విద్యార్థి క్షమాపణలు చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. విద్యార్థి కెరీర్ నాశనమవుతుందనే ఉద్దేశంతో కేసు పెట్టేందుకు నిరాకరించారు.  


అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎయిర్‌లైన్స్ ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించింది. ఏటీసీ అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై బాధితుడి స్టేట్‌మెంట్‌ను పోలీసులు తీసుకున్నారు. మరోవైపు నిందితుడిపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ కఠిన చర్యలు తీసుకుంది. భవిష్యత్‌లో అతను అమెరికన్ ఎయిర్‌లో ప్రయాణించడానికి అనుమతిలేదని స్పష్టం చేసింది. ఆ విద్యార్థి రిటర్న్ టిక్కెట్‌ను కూడా క్యాన్సిల్ చేసినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.


గతేడాది ఎయిర్ ఇండియా విమానం ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన సంచలనం రేపింది. గతేడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తుండగా.. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆమె దుస్తులు, బూట్లు, హ్యాండ్ బ్యాగ్ మొత్తం మూత్రంతో తడిసిపోయాయి. దీంతో ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. వారు పట్టించుకోకపోలేదు. ఆ తరువాత బాధిత మహిళ సంస్థ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌కు లేఖ రాయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.


Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు  


Also Read: Bandi Sanjay: పీఆర్‌సీ ఏర్పాటు చేయండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి