Bandi Sanjay: పీఆర్‌సీ ఏర్పాటు చేయండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Letter to CM KCR: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పీఆర్‌సీ అమలుతోపాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 04:22 PM IST
Bandi Sanjay: పీఆర్‌సీ ఏర్పాటు చేయండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Letter to CM KCR: తక్షణమే వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ)ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1 నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు చెల్లించాలన్నారు. ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఈనెల 9న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించబోన్న నేపథ్యంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు.

'ఉద్యోగుల సమస్యల్లో ప్రధానమైనది వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ఏర్పాటు అంశం. 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేయడంతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీ పాలనలో  తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతినెలా 1వ తేదీన జీతాలు తీసుకోవడం ఉద్యోగుల హక్కుగా ఉన్నప్పటికీ.. సక్రమంగా జీతాలు చెల్లించకుండా వారి హక్కులను కాలరాస్తున్నారు. 317 జీవో అమలు పేరుతో ఉద్యోగుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. 

చివరకు కీలకమైన పీఆర్‌సీ ఏర్పాటు, అమలు విషయంలోనూ మీరు తీవ్రమైన కాలయాపన చేస్తున్నారు. స్వరాష్ట్రంలో సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్‌సీ నివేదిక అమలులో మీరు చేసిన జాప్యంవల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు 21 నెలలపాటు పెంచిన జీతాన్ని నష్టపోయారు. ఈ ఏడాది జూన్ 30 నాటితో మొదటి పీఆర్‌సీ గడువు కూడా ముగియబోతోంది. జూలై 1, 2023 నుంచి కొత్త పీఆర్‌సీ అమల్లోకి రావాలి. కానీ ఇప్పటివరకు మీరు కనీసం పీఆర్‌సీ కమిషన్‌ను నియమించకపోవడం సహించరాని విషయం. ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే అవుతుంది.

 

 
పే రివిజన్ కమిషన్ నివేదిక లేకుండా పీఆర్‌సీని ఎట్లా అమలు చేస్తారు..? మీ వైఖరిని చూస్తుంటే ఏదో విధంగా జాప్యం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీని ఎగ్గోటాలనే ధోరణి కన్పిస్తోంది. ఈ విషయంలో మీరు అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సమర్ధనీయం కాదు. ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉద్యోగులపట్ల కక్షపూరిత ధోరణి సరికాదు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ద్రుష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ)ని ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు 3 నెలల గడువు విధించి నివేదిక తెప్పించుకుని ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్‌సీని అమలు చేయాలని కోరుతున్నాం. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం.
 
దీంతోపాటు గత సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత మీరు ఇచ్చిన హామీల్లో 99 శాతం నేటికీ అమలు కాలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ నేటికీ రైతులకిచ్చిన రుణమాఫీ, ప్రీ యూరియా హామీలు అమలు కాలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీల ఊసే లేదు. దళితులందరికీ దళిత బంధు, మూడెకరాల భూమి, గిరిజనులందరికీ గిరిజన బంధు, చేనేత కుటుంబాలకు చేనేత బంధుతోపాటు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, ఖాళీ జాగా ఉన్న వాళ్లందరికీ రూ.3 లక్షల చొప్పున ఆర్దిక సాయం వంటి ప్రధాన హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడం క్షమించరాని విషయం. 

రాబోయే కాబోయే మంత్రివర్గ సమావేశంలో పై హామీలపై చర్చించి తగిన నిధులు కేటాయించి వెంటనే అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ఆయా అంశాల అమలు కోసం భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని, జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది..' అని బండి సంజయ్ హెచ్చరించారు. 

Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు  

Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News