'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. తొలుత 21 రోజులు లాక్ డౌన్ విధించినప్పటికీ .. కరోనా మహమ్మారి లొంగి రాలేదు. ఈ  క్రమంలో లాక్ డౌన్ 2.0 విధించారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది.  ఐతే లాక్ డౌన్ విధించిన తేదీ మే 3 వరకు అందరికీ కేంద్రం ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తోందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజానిజాలేంటి..? PIB ఏం చెబుతోంది...? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ వాడకం కూడా ఎక్కువైంది. చాలా మంది ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. కాబట్టి ఇంటర్నెట్ వాడకం పెరిగింది. పైగా ఇళ్లల్లో ఉన్న చాలా మంది కూడా ఇంటర్నెట్ విపరీతంగా వాడుతున్నారు. ఈ క్రమంలో  తప్పుడు సమచారం కూడా వైరల్ అవుతోంది. అందులో ఒకటి..  కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు  అంటే లాక్ డౌన్ పూర్తయ్యే తేదీ వరకు ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తోంది.. అనే వార్త. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్‌గా మారింది. 


కానీ అలాంటిదేం లేదని.. భారత ప్రభుత్వం టెలికాం సంస్థ ఎలాంటి ఇంటర్నెట్  ఉచితంగా ఇవ్వడం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో..PIB వెల్లడించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న మేసేజ్‌లను నమ్మవద్దని ట్వీట్ చేసింది. దానికి సంబంధించిన లింకులపై క్లిక్ చేయవద్దని కోరింది.



లాక్ డౌన్ వేళ.. ఇంటర్నెట్ వాడకం పెరిగిందన్నది వాస్తవం. ఐతే ఇంటర్నెట్ ఉపయోగం పెరిగిన నేపథ్యంలో కనెక్టివిటీకి ఇబ్బందులు రాకుండా చూస్తామని భారత టెలికం మంత్రిత్వ శాఖ తెలిపింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..