Fourth Wave Scare: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఆ నగరాల్లో మాస్క్ ధారణ ఇక తప్పనిసరి
Fourth Wave Scare: కరోనా వైరస్ కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల్లో కరోనా పాజిటివ్ కేసులు కలవరం రేపుతున్నాయి. ఈ నేపధ్యంలో మాస్క్ ధారణను మళ్లీ తప్పనిసరి చేస్తున్నాయి ఆ నగరాలు.
Fourth Wave Scare: కరోనా వైరస్ కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల్లో కరోనా పాజిటివ్ కేసులు కలవరం రేపుతున్నాయి. ఈ నేపధ్యంలో మాస్క్ ధారణను మళ్లీ తప్పనిసరి చేస్తున్నాయి ఆ నగరాలు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాలు, ఎన్‌సీఆర్ పరిధిలోని ప్రాంతాలు మరోసారి అప్రమత్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణను తప్పనిసరి చేస్తున్నాయి. కరోనా ఫోర్త్‌వేవ్ భయం నేపధ్యంలో ఉత్తరప్రదేశ్, హర్యానాలు కొన్ని జిల్లాల్లో మళ్లీ మాస్క్ నిబంధన పెడుతున్నారు. స్కూల్స్ సహా అన్నిచోట్లా మాస్క్ ధారణ తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సహా ఎన్‌సీఆర్ పరిధిలోని ఆరు జిల్లాల్లో మాస్క్ తప్పకుండా ధరించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీఆర్ పరిధిలోని జిల్లాలపై కోవిడ్ కేసుల ప్రభావం ఉండనుండటంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా గౌతమ్ బుద్ధనగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్ షహర్, బాఘ్‌పత్ సహా రాష్ట్ర రాజధాని లక్నోలో మాస్క్ నిబంధనను మళ్లీ ప్రవేశపెట్టారు. గత 24 గంటల్లో గౌతమ్ బుద్ధనగర్‌లో 65, ఘజియాబాద్‌లో 20, లక్నోలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి.
మరోవైపు హర్యానా ప్రభుత్వం కూడా మాస్క్ ధారణ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ నిబంధన అమలు కానుంది. కొత్తగా రాష్ట్రంలో 234 కొత్త కేసులు నమోదుకావడం, అందులో గురుగ్రామ్‌లో 198, ఫరియాబాద్‌లో 21 కేసులున్నాయి. గురుగ్రామ్, ఫరియాబాద్ సోనిపట్, ఝాజర్ నగరాల్లో మాస్క్ నిబంధనను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మిగిలిన జిల్లాల్లో కేసులు లేకపోయినా..ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మాస్క్ ధారణ తప్పనిసరి నిబంధన తక్షణం అమలు కానుంది. ఢిల్లీలో పెరుగుతున్న కేసుల నేపధ్యంలో డీడీఎంఏ అత్యవసరంగా రేపు అంటే ఏప్రిల్ 20న సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Also read: Sadhvi Ritambara: ఒక్కొక్క హిందువు నలుగురిని కనాల్సిందే, సాధ్వి రితాంబర వివాదాస్పద వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook