Uddhav Thackeray: మహారాష్ట్ర అపఖ్యాతికి కుట్ర.. సరైన సమయంలో స్పందిస్తా
మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మదన్‌శర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు.
Maharashtra CM Uddhav Thackeray: ముంబై: మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మదన్‌శర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. తాము మౌనంగా ఉన్నామంటే.. ఏమీ చేతకాక కాదని.. దాన్ని బలహీనతగా తీసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం తన దృష్టి అంతా కరోనా కట్టడిపైనే ఉందని స్పష్టంచేశారు. ఈ క్రమంలో కొంతమంది కావాలని మహారాష్ట్రను కించపరిచేందుకు కుట్ర చేస్తున్నారని, దీనిపై సరైన సమయంలో స్పందిస్తానంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌తోపాటు తమను విమర్శిస్తున్న రాజకీయ పార్టీలతోనూ పోరాటం చేస్తున్నామని ఠాక్రే తెలిపారు. కరోనా కట్టడికి ఈనెల 15 నుంచి నా కుటుంబం - నా బాధ్యత’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..
అయితే.. ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా తయారైందని మహారాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై కంగనా రనౌత్ విమర్శలు చేసిస అనంతరం బీఎంసీ ఆమె ఆఫీస్‌ను కూల్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రనౌత్ శివసేన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్, ఎన్సీపీని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు సైతం చేసింది. దీనిపై ఆమె ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను సైతం కలవనుంది. Also read: Kangana Ranaut: ‘నేనూ డ్రగ్స్‌కు బానిసయ్యా’.. కంగనా పాత వీడియో వైరల్
ఇదిలాఉంటే.. సీఎం ఉద్ధవ్‌ను అపహాస్యం చేస్తూ గీసిన కార్టూన్‌ను ఫార్వర్డ్ చేశారంటూ శుక్రవారం నేవీ మాజీ అధికారి మదన్ శర్మ నివాసానికి వెళ్లి శివసేన కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. తనపై నలుగురు శివసేన కార్యకర్తలు దాడిచేశారని.. మహారాష్ట్రలో శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే సీఎం పదవీ ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయాలని మదన్‌శర్మ డిమాండ్ చేశారు. అంతేకాకుండా దాడిచేసిన వారు బెయిల్‌పై విడుదలవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. Also read: US Open 2020: ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్‌గా నవోమి ఒసాకా