Amit Shah on POJK: POJK (Pakistan Occupied Jammu Kashmir) పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో తిరిగి విలీనం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం గోధుమ పిండి కోసం అల్లర్లు జరగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా కాక రేపుతున్నాయి. అంతేకాదు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పశ్చిమ బంగాల్‌లో ఓ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా  విశ్వాసం వ్యక్తం చేసారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో శాంతి పవనాలు వీస్తున్నాయమని తెలిపారు. 2019లో అధికారంలో వచ్చిన తర్వాత వివాదాస్పదమైన 370 అధికరణం రద్దు చేసి జమ్ము కశ్మీర్‌కు విముక్తి కల్పించామన్నారు. ఒకపుడు జమ్ము కశ్మీర్‌లో జరిగే రాళ్ల దాడులు.. ఇపుడు పాకిస్థాన్ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌లో భారత్ కలుస్తామని అక్కడ ప్రజలు పాక్ పై  రాళ్ల దాడులు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భగా ప్రస్తావించారు. మరోవైపు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్.. పాకిస్థాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచు పడ్డారు షా. వారి దగ్గర అణు బాంబులు ప్రయోగించే లోపే పీవోజేకేను  భారత్ సర్కార్ వెనక్కి తీసుకుంటామన్నారు. ఈ సందర్బంగా పశ్చిమ బంగాల్ ప్రజలు అభివృద్దికి ఓటు వేస్తారో.. జిహాదీ మూకలకు ఓటు వేస్తారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు రావడంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు.. ఆర్టికల్ 370 రద్దు చేసామన్నారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే పీవోజేకే భారత్‌లో తిరిగి కలుపుతామన్నారు. అప్పట్లో నెహ్రూ చర్యల వల్ల పాకిస్థాన్ ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పీవోజేకే తిరిగి భారత్‌లో కలుపుకుంటామన్నారు. మరోవైపు కాశీలోని జ్ఞానవాపీ మందిరంతో పాటు మధురాలో శ్రీకృష్ణ మందిరంపై ఎన్నికల ఫలితాల తర్వాత అందరకీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు.


ఇదీ చదవండి అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter