Ratan Tata: ఇంటర్వ్యూస్ తో మనల్ని తెగ మెప్పించిన యాంకర్ రతన్ టాటా లవర్ అని తెలుసా? ఇప్పుడు ఆమె ఏమనిందంటే..!

Ratan Tata Love Story : రతన్ టాటా పెళ్లి చేసుకోలేదన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన ఎవరిని ప్రేమించలేదు అనుకుంటే.. మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. ఆయనకు దాదాపు మూడు ప్రేమ కథలు ఉన్నాయి. ఆ మూడు ప్రేమ కథల్లో.. ఒక ప్రేమ కథ మాత్రం ఎప్పుడూ మిగిలిపోతుంది.. ఆ ప్రేమ కథలో హీరోయిన్ మరెవరో కాదు.. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఒక యాంకర్.

1 /5

టాటా సంస్థల అధినేత రతన్ టాటా ఇకలేరు అనే విషయాన్ని అటు సెలబ్రిటీలు, ఇటు పారిశ్రామికవేత్తలు, ఆయన సంస్థలలో పనిచేసే కార్మికులు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన మరణం తీరని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.

2 /5

ఇదిలా ఉండగా ఎన్ని సంవత్సరాలు అయినా.. ఎన్ని వేల కోట్లకు అధిపతి అయినా .. ఆయన మాత్రం ఒంటరిగానే జీవించారు. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే విషయాలు వైరల్ అవుతుండగా ఆయన.. ఏకంగా నాలుగు సార్లు ప్రేమలో విఫలం అయ్యారట. అందుకే పెళ్లికి దూరం అయ్యారని సమాచారం. 

3 /5

అలా తన ప్రేయసిలలో ఒకరైన సిమి గరేవాల్ తన మాజీ ప్రేమికుడు రతన్ టాటా పై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రతన్ టాటా మాజీ ప్రేయసి సిమీ గరేవాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. 86 ఏళ్ల వయసులో రతన్ టాటా మరణించిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి తరం కాదు. ఈ కష్టం భరించలేనిది వీడ్కోలు నా మిత్రమా అంటూ ఆమె భావోద్వేగ నివాళులు అర్పించారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇకపోతే సిమి గరేవాల్  తన ఐకానిక్ టాక్ షో రెండెజౌస్ నుండి రతన్ టాటా తో కలిసి ఉన్న ఫోటోని పంచుకుంటూ.." మీరు వెళ్లిపోయారని వారు అంటున్నారు.. మీ నష్టాన్ని భరించడం చాలా కష్టం..  వీడ్కోలు నా మిత్రమా.. రతన్ టాటా.." అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. 

4 /5

సిమి గరేవాల్ 2011 ఇంటర్వ్యూలో రతన్ టాటా తో తనకున్న బంధాన్ని కూడా తెలిపింది. ఆమె తమ బంధం గురించి వివరిస్తూ రతన్, నేను చాలా దూరం వెనక్కి వెళ్ళాము. అతను పరిపూర్ణుడు. మంచి హాస్య కారుడు కూడా.. నిరాడంబరమైన వ్యక్తి. పరిపూర్ణమైన పెద్దమనిషి. డబ్బు ఎప్పుడు కూడా నిలవదు అని చెబుతూ ఉంటాడు. ముఖ్యంగా డబ్బు మనిషి కాదు, విదేశాలలో ఉన్నంత ప్రశాంతంగా భారతదేశంలో లేడు. మా మధ్య సంబంధం ఉన్నప్పటికీ మా ప్రేమ కొనసాగలేదు అంటూ ఆమె తెలిపింది. 

5 /5

ఇకపోతే రతన్ టాటా తో ప్రేమ బ్రేకప్ అయిన తర్వాత ఈమె మరొకరిని వివాహం చేసుకుంది. అయినా సరే ఇప్పటికి వారు స్నేహితులుగానే ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే రతన్ టాటా నుంచి విడిపోయిన ఆయన పైన ఇష్టాన్ని మాత్రం చంపుకోలేకపోతోంది సెమీ గరేవాల్.