బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ లు రాజ్య‌స‌భ స‌భ్యులుగా  ప్ర‌మాణ స్వీకారం చేశారు.రాజ్యసభలో వీరివురి చేత సభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించాయి. ప్రమాణస్వీకారం అనంతరం వీరిద్దరు వెంకయ్యనాయుడు ఆశీస్సులు తీసుకున్నారు.   పార్లమెంటేరియన్ గా ఎన్నికవడం అమిత్ షాకు ఇదే తొలిసారి కాగా.. స్మృతీ ఇరానీ ఎన్నిక కావడం ఇది రెండో సారి.  ఇటీవల గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ బలం రెట్టింపు..


రాజ్యసభలో వీరిద్దరి రాకతో రాజ్యసభలో బీజేపీకి మరింత బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం వీరితోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాజ్యసభలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి బలం రాజ్యసభలో 100 దాటిన విషయం తెలిసిందే.