న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై  సామజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన పుకార్లను కొట్టిపారేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఏ వ్యాధితో బాధపడటంలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ట్వీట్ చేశారు. నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, ఏ వ్యాధితో బాధపడటం లేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నానని ట్వీట్ లో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది ఆయన ఆరోగ్యం గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణనిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రానికి 30 ఏళ్లు


కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాడుతుందని, కాగా దేశవ్యాప్తంగా సుమారుగా 60,000 మంది ప్రజలను ప్రభావితం చేసిన వైరస్ దాదాపుగా 1,900 మందికి పైగా మృతి చెందారు. కాగా హోంమంత్రిగా తన విధులను నిర్వర్తించడంలో బిజీగా ఉన్నందున ఈ పుకార్లపై ఆయన దృష్టి పెట్టలేదని, గత రెండు రోజులుగా లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసినందున ఈ రోజు తాను స్పష్టం చేస్తున్నానని ఆయన అన్నారు. 


Also read : SSC exams 2020 : పాత హాల్ టికెట్స్‌తోనే 10వ తరగతి పరీక్షలు.. సర్కార్ కీలక నిర్ణయం


పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై హోంమంత్రి మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం గురించి ఇలాంటి ఊహాగానాలు తనను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసినందుకు బీజేపీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..