Amitabh Bachchan: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్నికల తేదిలు దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక 2024లో భారత దేశంలో జరిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం దేశంలోని అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. ఒక రకంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అని చెప్పాలి. దాదాపు ఈ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు.  ఏప్రిల్ 19 న తొలి విడత ఎన్నికలతో తొలి దశ ఎన్నికలు మొదలైన .. జూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో ముగుస్తాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం మనం చూస్తుంటాము. అలాంటి ఘటనే 1984లో జరిగింది. ఆ యేడాది అమితాబ్ వచ్చన్ ఎన్నికల గోదాలో దిగినపుడు పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1984లో రాజీవ్ గాంధీ ప్రోద్భలంలో తయన ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) నుంచి అమితాబ్ ఎన్నికల బరిలో దిగారు. బిగ్ బీ పై అప్పట్లో భారతీయ లోక్‌దళ్ నుంచి సీనియర్ నేత హేమవతి నందన్ బహుగుణ పోటీ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల ప్రచారలో భాగంగా అమితాబ్ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్న టైమ్‌లో అప్పట్లో అమ్మాయిలు.. మహిళలు డప్పులు కొడుతూ స్వాగతం పలికేవారట. అమితాబ్ అప్పట్లో ఎక్కడికి వెళ్లినా.. లవ్ యూ అమితాబ్ జీ అంటూ అమ్మాయిలు ఆయన్ని ఫాలో అయ్యేవారట. అంతేకాదు కొంత మంది లేడీ అభిమానులు తమ చున్నీలను బిగ్ బీ పై విసిరి తమ అభిమానాన్ని చాటుకునేవారు. అప్పట్లో ప్రయాగ్ రాజ్ వీధుల్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు..ఇలా బీదా, బిక్కి, పండు, ముసలీ అమితాబ్‌ను చూసేందుకు ఎగబడేవారు. కొన్ని సార్లు అభిమానులు చేసే పనులు చూసి అమితాబ్ సిగ్గుపడిపోయేవారట.


ఇక పోలింగ్ రోజు ప్రయాగ్ రాజ్ ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కాగానే బ్యాలెట్ పేపర్ పై అమితాబ్ బచ్చన్‌కు వచ్చిన ఓట్లతో పాటు లిప్‌స్టిక్ గుర్తులు కనిపించాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ లిప్‌ స్టిక్ గుర్తులతో కూడిన బ్యాలెట్ పేపర్లు రావడం మొదలయ్యాయి. అమితాబ్ కు ఓటు తో పాటు లిప్‌స్టిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ పేపర్లు అప్పట్లో దాదాపు 4 వేలకు పైగా వచ్చాయి. అప్పట్లో ఎన్నికల సంఘం ఆ ఓట్లను రద్దు చేసింది. అయినా.. ఆ ఎలక్షన్‌లో అమితాబ్ బచ్చన్.. 2,97, 461 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్ధి బహుగుణకు 1,09,666 ఓట్ల పోలయ్యాయి. అమితాబ్ బచ్చన్ ఆ ఎన్నికల్లో 1,87,795 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. అయితే అమితాబ్ ఆ తర్వాత తనపై వచ్చిన కొన్ని ఆరోపణల నేపథ్యంలో మధ్యలోనే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు. ఆ తర్వాత ఆయన ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన పోటీ చేయకపోయినా.. ఆ భార్య జయా బచ్చన్.. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.


Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter