Elon Musk Victory Secret: ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్. వయస్సు యాభై ఏళ్లై గానీ..ఎందరో ప్రముఖుల్ని వెనక్కి నెట్టి..అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకీ అతని విజయ రహస్యమేంటి. ప్రముఖ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా ఏం చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెస్లా కంపెనీ అధినేత, స్పేస్‌ఎక్స్ సృష్టికర్త ఎలాన్ మస్క్(Elon Musk)పేరు అందరికీ సుపరిచితమే. ఇప్పుడు ప్రపంచంలో కుబేరుడు ఇతడే. వయస్సు కేవలం 50 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖ వ్యాపారుల్ని వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నాడు. సంపాదనను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాడు. కొద్దిరోజుల క్రితం ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలిచినా..వారం తిరగకుండానే తిరిగి ఆ స్థానాన్ని ఆక్రమించేశాడు ఎలాన్ మస్క్. స్పేస్‌ఎక్స్ చేపట్టిన ఇన్‌స్పిరేషన్ 4 యాత్ర(Inspiration 4)దిగ్విజయంగా పూర్తవడంతో ఎలాన్ మస్క్ కంపెనీ షేర్లు మరింతగా పెరిగాయి. అసలు ఎలాన్ మస్క్ తక్కువ వయస్సులోనే ఇంత ధనవంతుడెలా అయ్యాడనే చర్చ నడుస్తోంది. 


ఎలాన్ మస్క్ విజయ రహస్యాన్ని ప్రముఖ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా(Anand mahindra)వివరించారు. మార్కెట్ కేపిటల్ పలు రెట్లు పెరగడం వల్ల ఎలాన్ మస్క్ ధనవంతుడు కాలేదని స్పష్టం చేశారు. ఆశయం, ధైర్యం, తెగింపు వంటి లక్షణాలు ఆయనలో చాలా ఉన్నాయని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ లక్షణాలున్నవారి సంపాదన భవిష్యత్‌లో మిగిలినవారి కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ట్యాగ్‌లైన్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మధ్య నడుస్తోంది. ఇటీవల ఎలాన్ మస్క్‌కు సంబంధించి టెస్లా(Tesla),స్పేస్‌ఎక్స్(SpaceX)సంస్థల ధరలు పెరిగాయి. ఫలితంగా మార్కెట్ క్యాపిటల్‌లో కొత్తగా 70 బిలియన్ డాలర్ల సంపద వచ్చి చేరింది. 


Also read: Covid cases in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు...231 రోజుల కనిష్ఠానికి వైరస్ వ్యాప్తి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి