కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్ణాటక ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే చాలా ఇష్టమని.. వారు సినిమాలు బాగా చూస్తారని... రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలు, గుడి పర్యటనల పట్ల కూడా వారికి అదే ఫీలింగ్ ఉందని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

60-70 సంవత్సరాలుగా సంఘ పరివార్ హిందుత్వం గురించి ప్రచారం చేస్తుందని.. ఇప్పటికైనా సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ లాంటి వారు మేల్కొన్నందుకు సంతోషమని ఆయన అన్నారు.


"వారు ఈ మధ్య గుళ్లూ, గోపురాలు సందర్శిస్తున్నారంటే అది సంతోషదాయకమైన విషయమే. కానీ హిందువులమని వారు చెప్పుకుంటే చాలదు. హిందుత్వాన్ని అనుసరించినప్పుడే వారు నిజమైన హిందువులు అవుతారు. లేకపోతే నకిలీ హిందువులుగా వారిని భావించాల్సి ఉంటుంది" అని అనంత్ కుమార్ హెగ్డే తెలిపారు.