Andaman Covid-19 Vaccination: అండమాన్ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్..తొలి కేంద్రపాలిత ప్రాంతంగా రికార్డు
Vaccination: అర్హులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందించిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్-నికోబార్ దీవులు రికార్డు సృష్టించింది.
Andaman & Nicobar Islands: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఓ పక్క ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ...మరో పక్క టీకా డోసులు వేయడం ఆపలేదు అధికారులు. ఈ క్రమంలో రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసిన మెుట్టమెుదటి కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్-నికోబార్ దీవులు(Andaman & Nicobar Islands) రికార్డు సృష్టించింది. కేవలం కొవిషీల్డ్ టీకా(Covishield)తో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం గమనార్హం.
అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాక్సినేషన్(Vaccination) అత్యంత సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని..ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని టీకాలు వేశామని అక్కడి పాలకవర్గం ట్విట్టర్ లో వెల్లడించింది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కి.మీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవులకు చేరుకొని వ్యాక్సిన్లు అందజేశామని పేర్కొంది. అక్కడ కూడా జనవరి 16నే టీకా వేయడం ప్రారంభమైంది.
Also Read: Covid Super Strain: ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, సూపర్ స్ట్రెయిన్‌పై పెరుగుతున్న ఆందోళన
అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల వెల్లడిస్తున్నాయి. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మందికి టీకాలు అందాయి. ప్రస్తుతం ఇక్కడ రెండు క్రియాశీలక కేసులున్నాయి. ఇప్పటికే అర్హులందరికీ 100 శాతం రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి