IMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ అయింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం నమోదైంది.
గత కొద్దిరోజుల్నించి ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. భరించలేని ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. అయితే రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో వాతావరణం మారిపోనుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక రేపు శనివారం నాడు నిజామాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూలు, కామారెడ్డి, మెదక్, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇవాళ తెలంగాణలోని హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం నమోదైంది. భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. అటు కర్నూలు జిల్లా ఆలూరులో, కడపలో భారీ వర్షం కురిసింది. కడప, పులివెందుల, కమలాపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Also read: Tirumala Laddu Row: తిరుమల లడ్డూపై సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.