Heavy Rains Alert: ఓ వైపు నైరుతి రుతు పవనాలు బలపడుతూ చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దాంతో ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు ఏర్పడనుంది. రానున్న మూడ్రోజులు భారీ వర్షసూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ప్రాంతంలో పశ్చిమం, నైరుతి నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. రానున్న ఐదు రోజులు వాతావరణం మేఘావృతమై, మోస్తరు వర్షాలతో ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. అటు హైదారాబాద్‌లో కూడా ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


ఇక బంగాళాఖాతంలో రేపు జూన్ 26న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై బలంగా ఉండనుంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో కూడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశాలున్నాయి. దాంతో భారీ వర్ష సూచన జారీ అయింది. 


Also read: New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook