AP TS Poll Percentage: ఏపీ, తెలంగాణల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికే అవకాశం
AP TS Poll Percentage: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులతో జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 6 నియోజకవర్గాల్లో పోలింగ్ ముసిగింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కలుగుతోంది. పూర్తి వివరాలు పరిశీలిద్దాం.
AP TS Poll Percentage: ఏపీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ ఏ స్థాయిలో నమోదు కానుందో తెలియాలంటే మరో గంట ఆగాల్సిందే. ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే గత ఎన్నికల్లో ఉన్నట్టే 79 శాతం వరకూ ఉండవచ్చు. సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం నమోదైంది.
పల్నాడు ప్రాంతంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ సమయం ముగి.యడంతో 6 గంటల వరకూ క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఎండల కారణంగా ఉదయం 7 గంటలకే జనం ఓటేసేందుకు బారులు తీరారు. పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఏపీలో మిగిలిన 169 నియోజకవర్గాల్లో 6 గంటల వరకూ క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైంది.
2019లో ఏపీలో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అదే పోలింగ్ లేదా 1 శాతం తక్కువ నమోదు కావచ్చని అంచనా. విశాఖపట్నంలో అత్యల్ప ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకూ 61.16 పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్పంగా 39.17 శాతం పోలింగ్ నమోదు కాగా సికింద్రాబాద్‌లో 42.48 శాతం పోలింగ్ నమోదైంది. భువనగిరిలో అత్యధికంగా 72.34 శాతం పోలింగ్ నమోదైంది.
Also read: Black Tea with Lemon: లెమన్ బ్లాక్ టీ ఆరోగ్యానికి మంచిది కాదా, కిడ్నీల్ని పాడు చేస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook