Elephant Attack on Bus: గజరాజు ఆగ్రహం... బస్సుపై దాడి.. తరువాతేం ఏం జరిగింది..??
ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తున్న ఒక బస్సుపై అకస్మాత్తుగా ఏనుగు దాడి చేసింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వారి ప్రాణాలను ఎలా కాపాడాడో మీరే చూడండి.
Angry Elephant Attack on Bus: భారీ శరీరం కలిగిన ఏనుగు అడవికి రారాజు.. ఒకసారి గజరాజుకు కోపం వస్తే ఎంతటి క్రూర మృగాలైన వణికిపోవాల్సిందే. ఇపుడు ఇవన్ని ఎందుకు అనేగా మీ సందేహాం. తమిళనాడులో జిరిగిన ఒక సంఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక విషయానికి వస్తే.. మనం సాధారణంగా ఏనుగులు మనుషులపై దాడి చేయటం, పంటలను నాశనం చేయటం చూసాం కదా..!! మరికొన్ని చోట్ల రోడ్లపైకి వచ్చి, వాహనాలను నుజ్జు నుజ్జు చేయటం చూసాం. అలాగే ఈ నెల 25 వ తేదీన తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తున్న ఒక బస్సుపై దాడి చేసిన వీడియో తెగ వైరలైంది.
Also Read: Breaking News: పదవికి రాజీనామా చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ
గజరాజు ఆగ్రహం
ప్రభుత్వ ఉద్యోగులను కోటగిరి (Kotagiri) నుంచి మెట్టుపాలయంకి (Mettupalam) తీసుకువెళ్తున్న బస్సుపైకి ఒక ఏనుగు ఉన్నట్టు ఉంది దాడి చేసింది. తోడంతో, పొడవాటి దంతాలతో బస్సు అద్దాలను పగలగోట్టడంతో, బస్సులోని ఉద్యోగస్తులు భయతంతో వణికిపోయారు. కానీ ఈ సమయంలో బస్సు డ్రైవర్ సమయ స్పూర్తితో ప్రయాణికులందర్నీ బస్సు వెనుక వైపుకి తీసుకువచ్చి కదలకుండా ఉండమని చెప్పాడు.
బస్సు ఉన్నట్టుండి కదలటంతో ఆగ్రానికి గురైన గజరాజు పరిగెత్తుకువచ్చి బస్సును డీ కొట్టింది. ఆ సమయంలో డైవర్ ఏమాత్రం కంగారు పడకుండా బస్సును నిలిపివేయటంతో ఏనుగు కాసేపు అక్కడే ఉండి, తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది.
Also Read: Breaking News: పదవికి రాజీనామా చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ
డ్రైవర్ పై ప్రశంసల జల్లు
అయితే ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలతో గొప్ప అద్భుతాలు శృష్టించవచ్చని ప్రభుత్వ అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రధాన కార్యదర్శి సుప్రీయ సాహు ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ "ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు చేయగలం" అనే ట్యాగ్‌లైన్ జోడించారు.
ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవ్వటమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ కు అభినందలను తెలుపుతూ, ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు కూడా ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితిలో ఉంటే.. నిదానంగా అలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం మీకే సొంతం అవుతుంది.
Also Read: Kohli's Shirtless Photo: షర్ట్ లేకుండా టీమిండియా కెప్టెన్... వైరలైన విరాట్ కోహ్లీ ఫోటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి