Breaking News: పదవికి రాజీనామా చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ రాజకీయాలు రోజు రోజులకు మారుతున్న తరుణంలో  ఈ రోజు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షు పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసారు   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2021, 03:58 PM IST
Breaking News: పదవికి రాజీనామా చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Big Shock for Congress Party: పంజాబ్ రాజకీయాలు సమీకరణాలు రోజు రోజులకు మారుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

సోనియాగాంధీకి పంపిన రాజీనామా లేఖలో, పరోక్షంగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను ఉద్దేశించి, "వారికి వ్యక్తిత్వం లేదు, తన స్వార్థం కోసం వెంపర్లాడుతున్నాడు, రాష్ట్ర భవిష్యత్తు, సంక్షేమం విషయంలో నేను ఎవరితో రాజీపడను, అందుకే పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇక నుండి సాధారణ కార్యకర్తగా పార్టీలోనే కొనసాగుతాను" అని లేఖలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేసారు. 

Also Read: Inzamam Ul Haq: గుండెపోటుకు గురైన దిగ్గజ క్రికెటర్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌

పంజాబ్‌లో చాలాకాలంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ -సిద్ధు మధ్య వివాదం నెలకొన్న సంగతి మనకు తెలిసిందే.అయితే, పంజాబ్ కాంగ్రెస్‌ పార్టీలో సెప్టెంబర్ 18 న నవజ్యోత్ సింగ్ సిద్ధూ భాద్యతన తిరుగుబాటు మొదలైంది ఫలితంగా అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత  సెప్టెంబర్ 20 న, చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా నియమించారు. పాకిస్తాన్‌కు సన్నిహితంగా ఉండే సిద్దూను సీఏం చేస్తే, పంజాబ్‌ సర్వనాశనం అవుతుందని మరియు సిద్దూ జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నారని కెప్టెన్ అమరీందర్‌ హైకమాండ్‌ను హెచ్చరించారు. 

కెప్టెన్ బహిరంగంగా సిద్ధూకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. అమరీందర్ సింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ. సిద్దును ముఖ్యమంత్రిని కానివ్వని అని చేసిన వ్యాఖ్యలు అందరికీ విధితమే. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత, చరణ్‌జిత్ సింగ్ చన్నీకి పంజాబ్ ముఖ్యమంత్రిని చేయటం అందరికీ తెలిసిందే.

Also Read: Kohli's Shirtless Photo: షర్ట్ లేకుండా టీమిండియా కెప్టెన్... వైరలైన విరాట్ కోహ్లీ ఫోటోస్

ఢిల్లీకి బయల్దేరిన కెప్టెన్ అమరీందర్ సింగ్ అమిత్ షాను, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో  కలవనున్నట్లు పుకార్లు వచ్చినప్పడికీ, ఢిల్లీకి ఆయన వ్యక్తిగత పనుల మీద వచ్చారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమయంలో సిద్దు రాజీనామా చేయటం సంచలనం రేపింది.  పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరునెలల గడువు మాత్రమే ఉండటం, ప్రభుత్వంలో ఉన్న ఈ సమయంలో కాంగెస్ పార్టీలో ముఖ్యమైన లీడర్ల మధ్య కలహాలు రావటం కాంగ్రెస్‌ కొంపముచ్చేలా ఉన్నాయి. సిద్ధూ చేసిన ఈ పనికి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో ఎదురుచుదాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News