International flights: అంతర్జాతీయ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు ( International flights ) ప్రారంభమయ్యేదెప్పుడు అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. అనేక ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు 4 నెలల క్రితం నుంచే అంతర్జాతీయ విమానాల రాకపోకలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు ( International flights ) ప్రారంభమయ్యేదెప్పుడు అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. అనేక ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు 4 నెలల క్రితం నుంచే అంతర్జాతీయ విమానాల రాకపోకలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో చిక్కుకుపోయి, స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్న వారిని భారత్‌కి చేర్చేందుకు వందేభారత్ మిషన్ పేరిట భారత్ పలు ప్రత్యేక విమానాలు ( Special flights ) విదేశాలకు వెళ్లి వచ్చేందుకు అనుమతిస్తున్నప్పటికీ... ఇదివరకులా తరచుగా విదేశాలకు వెళ్లి వచ్చే పరిస్థితి అయితే లేదు. దీంతో వివిధ రకాల పనులపై ఎప్పుడంటే అప్పుడు తరచుగా విదేశాలకు ప్రయాణాలు చేయాల్సి వచ్చే వారికి ఇది ఓ ప్రతిబంధకంగా మారింది.
( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )
ఇదిలావుంటే, మరోవైపు అనేక ఎయిర్ లైన్స్ సంస్థలు ( Airlines ) సైతం అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ వస్తున్నాయి. లాక్‌డౌన్ ( Lockdown ) సమయంలో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని.. ఇప్పటికైనా విమాన సేవలు పునరుద్ధరించకపోతే, ఆ నష్టాల నుంచి కోలుకోవడం కష్టమేనని ఆ సంస్థలు కేంద్రానికి విన్నవించుకుంటున్నాయి. ( Also read: Telangana: కరోనాకు ఉచిత చికిత్స, ఫ్రీగా కోవిడ్ టెస్టులు )
అంతర్జాతీయ విమాన సేవలపై రేపు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ( Civil Aviation Minister Hardeep Singh Puri ) మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ విమాన సేవలపై కేంద్ర మంత్రి నుంచి ఓ స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఎయిర్ లైన్స్ వర్గాలు ఆశిస్తున్నాయి. ( Also read: Skill India: నైపుణ్యమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ )
గతంలో జూన్ 20న మంత్రి హర్దీప్ సింగ్ పురి మీడియాతో మాట్లాడుతూ.. డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసుల్లో ( Domestic flights services ) 50-60 శాతం ఆక్యుపెన్సీకి చేరుకుని, అంతర్జాతీయ విమానాలకు ప్రపంచ దేశాలు ఎప్పుడు ఓకే చెబితే అప్పుడే భారత్ కూడా అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ( Domestic flights ) ఆక్యుపెన్సీ పెరిగినందున ఇంకొన్ని మార్గాల్లో డొమెస్టిక్ ఫ్లైట్స్ పెంచడంతో పాటు అంతర్జాతీయ విమానాలకు సైతం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎయిర్ లైన్స్ సంస్థలు భావిస్తున్నాయి. ఆగస్టు నెల మధ్యలో అంతర్జాతీయ విమానాలకు కేంద్రం ఓకే చెప్పే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కేంద్రం ఏం ప్రకటన చేయనుందనేది రేపటి సమావేశంతో తేలిపోనుంది.