World Youth Skill Day 2020: వరల్డ్ యుూత్ స్కిల్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) యువతను ఉద్దేశించి సంభోధించారు. ఆత్మనిర్భర్ భారత్ ( Atmanirbhar Bharat ) కల సాకారం అవడంలో యువతలో ఉన్న నైపుణ్యమే కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు. మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న వ్యాపారాలు, మార్కెట్లను బట్టి తగిన నైపుణ్యం సంపాదించుకోవాలని హితవు పలికారు ప్రధాని. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యం ( Skill ) చాలా కీలకమైన అంశంగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్కిల్ ఇండియా ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ( Skill India 5th Anniversary ) ప్రధాని మోదీ యువతను స్కిల్స్‌ను పెంచుకోమని కోరారు. Tamannaah: కన్నడ రీమేక్ మూవీలో తమన్నా
Skill is something which we gift to ourselves,
Which grows with experience.Skill is timeless,
It keeps getting better with time.Skill is unique, it makes you different from others: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 15, 2020
నైపుణ్యంఅనేది మనకు మనం ఇచ్చుకునే బహుమతి ( Skill Is A Gift ) అని అన్న ప్రధాని..కరోనావైరస్ ( Covid-19 ) సంక్షోభం వల్ల ప్రపంచ మార్కెట్లో ఎన్నో మార్పులు జరగనున్నాయి అని తెలిపారు. దానికి తగిన విధంగా స్కిల్స్ డెవలెప్ ( Skill Development ) చేసుకోవాలన్నారు. మంచి నైపుణ్యం అనేది అనుభవంతోనే పెరుగుతుంది అని అన్నారు. ఒక వ్యక్తిలోని నైపుణ్యమే అతన్ని ఉన్నత స్థానానికి చేర్చుతుందన్నారు.
కొత్త స్కిల్ నేర్చుకోవాలనే తపన లేనప్పుడు జీవిత గమనం ఆగిపోతుంది అని.. అందుకే నిత్యం స్కిల్ పెంచుకునేందుకు సిద్ధంగా ఉండాలి అని యువతకు సలహానిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. Jio- Google Deal: గూగుల్‌తో జియో భారీ డీల్ ?