Bread Biscuit Prices Hike India: భారత్‌లో క్రమంగా ద్రవ్యోల్బనం పెరుగుతోంది. దాని తోడు నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ పక్క సామాన్యుల పాలిట ధరలు సమస్యలుగా మారుతున్నాయి. గతంలో కేంద్రం గ్యాస్ సిలిండర్లు, చమురు ధరలను భారీగా పెంచింది. అయితే అతి త్వరలోనే సామాన్యులకు మరో షాకింగ్‌ న్యూస్‌ను చెప్పబోతోంది కేంద్రం. పిండి ధరలు, బ్రెడ్, బిస్కెట్ ధరలను పెంచబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే వీలైనంత తొందరగానే ఈ ధరలను పెంచే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే సంవత్సరం ప్రారంభం నుంచి పిండి రేట్లను 46 శాతంకు పెంచింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. గోధుమ ధరలు గతంలో ఏకంగా  46 శాతం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లలో ఎంఎస్‌పీ కంటే 20% ఎక్కువగా విక్రయిస్తున్నారు. FCI ఈ సంవత్సరం గోధుములకు సంబంధించి OMSS ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.


అయితే ఈ విషయంపై వినియోగదారుల సంస్థ ధరలు పెద్ద మొత్తంలో పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుంది. పలు నివేదికలు సూచించిన వివరాల ప్రకారం...జూన్‌ మధ్య భారీగా ధరలు పెరిగే అవకాలున్నాయని అంచన వేస్తున్నాయి. వర్ష కాలంలో తినే వస్తువులకు ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో...ద్రవ్యోల్బణం మరింత హెచ్చయే అవకాలున్నాయి.


విద్యాసంస్థలు, ఇతర సంస్థలు అప్పుడే తెరుచుకోవడంతో..బిస్కెట్ వంటి స్నాక్స్‌కి అధికంగా డిమాండ్ పెరుగుతున్నందున ధరలు మరింత పెచ్చరిల్లె అవకాశాలున్నాయి. పోయిన ఏడాదిలో గోధుమల ప్రాసెసింగ్‌ను 70 లక్షల టన్నులను సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటివరకు ఈ OMSSను ప్రకటించక పోవడంతో మున్ముందు కంపెనీలు ధరలను పెంచె అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.



గోధుమల ధరల పెరుగుదల వేటిపై ప్రభావం చూపనుంది:


కేంద్రం ప్రభుత్వానికి సంబంధించిన FCI ఇప్పటికీ OMSSను ప్రకటించక పోగా..గోధుమల ధరల పెరుగుతుండడంతో పిండితో తయారు చేసే బ్రెడ్, బిస్కెట్లు, బన్స్ ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.  వీటి ఉత్పత్తి ధరలు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి.


Also Read: Nizamabad Accident: తెలంగాణలో మరో రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి..!


Also Read: Cyclone Asani Live Updates: తీవ్ర తుపాను మారిన 'అసని'... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook