దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ (LockDown In India) విధించనున్నారని ప్రచారం జరుగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో సెప్టెంబర్ 25నుంచి కేంద్ర ప్రభుత్వం మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకుందని ఓ వార్త వైరల్ అవుతోంది. 25 అర్ధరాత్రి నుంచి 46 రోజులపాటు లాక్‌డౌన్ (lockdown from September 25) కొనసాగనుందన్న వార్త చక్కర్లు కొడుతోంది. Anantapur Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ విపత్తు నివారణ అధికార యంత్రాంగం (NDMA) సెప్టెంబర్ 25 నుంచి దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించాలని సూచించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్‌డీఎంఏ ఈ మేరకు ప్రతిపాదనలు చేసిన ఆర్డర్స్ అని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. TRS: రాజ్యసభ సభ్యులుగా కేశవరావు, సురేశ్‌ రెడ్డి ప్రమాణం


అసలు విషయం బయటపెట్టిన పీఐబీ..
మరోసారి లాక్‌డౌన్‌‌ను విధించాలని జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు (NDMA) ఏ ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుల్లో ఏ వాస్తవం లేదు. కనుక కేవలం అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని అధికారులు నిత్యం చెబుతూనే ఉన్నారు. Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR