Voter Slip: దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు రేపు మే 13 న జరగనున్నాయి. అటు ఎన్నికల సిబ్బంది, ఇటు రాజకీయ పార్టీల నేతలు ఓటరు స్లిప్ పంపిణీ చేస్తున్నారు. కొంతమందికి ఓటరు స్లిప్ అందడం లేదు. ఓటరు స్లిప్ అందనివాళ్లు ఓటు వేయడానికుండదని ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలీ ఓటరు స్లిప్ అంటే ఏమిటి, ఓటు వేయాలంటే ఇది ఎంతవరకూ అవసరం, ఒకవేళ లేకపోతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చా అనేది తెలుసుకుందాం. ఓటర్ స్లిప్ అనేది ఓటు వేసే క్రమంలో సదరు వ్యక్తి ఓటు ఎక్కడ ఉంది, ఏ బూత్‌లో ఉంది, సీరియల్ నెంబర్ ఎంత అనేది సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఓటర్ల జాబితాలో ప్రతి పేరునీ చెక్ చేసుకుంటూ సమయం వృధా కాకుండా ఉంటుంది. అందుకే  ఎన్నికల సిబ్బంది జారీ చేసే అధికారిక ఓటరు స్లిప్ మిస్ అయినా రాజకీయ పార్టీలు కూడా జారీ చేస్తుంటాయి. అంటే ఓటరు స్లిప్ లేకపోయినా ఓటు వేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదు. ఓటర్ల జాబితాలో పేరుంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చు.


ఒకవేళ ఓటరు స్లిప్ కూడా కావాలనుకుంటే సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎన్నికల సంఘం రూపొందించిన ఓటరర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అడిగిన వివరాలు నమోదు చేసి ఓటరు స్లిప్ పొందవచ్చు. ECI టైప్ చేసి స్పేస్ ఇచ్చి  ఓటరు ఐడీ నెంబర్ ఎంటర్ చేసి 1950కు ఎస్ఎంఎస్ చేయాలి. అంతే కేవలం 15 సెకన్లలో ఓటరు స్లిప్ వస్తుంది. 


ఓటరు స్లిప్‌పై ఓటరు పూర్తి పేరు, వయస్సు, జెండర్, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ పేరు, పోలింగ్ రూమ్ నెంబర్, పోలింగ్ తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. 


Also read: AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook