Apple Online Store Opens Sept 23 in India: న్యూఢిల్లీ: ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ( Apple ) కంపెనీ భారత ఐఫోన్ ( iPhone ) ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశం (India) లో త్వరలోనే ఆపిల్‌ తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ (Apple Online Store )ను ప్రారంభించనున్నట్లు అమెరికా సంస్థ యాపిల్ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభంతో భారత్‌లోని తమ కస్టమర్లకు మరింత చేరువకానున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు టిమ్ కుక్ ఈ విధంగా ట్విట్ చేశారు. ‘‘చుట్టూ ఉన్న ప్రపంచంలో తమకు ఇష్టమైన వారితో సన్నిహితంగా ఉండటం ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకే మా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఎదురుచూస్తున్నాం. సెప్టెంబర్‌ 23న భారత్‌లో మా కంపెనీ తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నాం’’ అని టిమ్‌ కుక్‌ ట్విట్‌లో రాశారు. Also read: Dubai: ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం



ఇదిలాఉంటే.. యాపిల్ సంస్థ 2021లో భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇదివరకే సీఈవో టిమ్ కుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. ఆన్‌లైన్ స్టోర్‌ను 23వ తేదీన ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. అయితే... ఇప్పటివరకు యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులను ఆన్‌లైన్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్, తదితర వాటి ద్వారా భారత మార్కెట్లో విక్రయించింది. Also read: Agricultue Bills: 25న భారత్ బంద్!.. మూడు రోజులపాటు రైల్‌రోకోకు పిలుపు