SBI SO Recruitment 2020 | కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు SBI శుభవార్త. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో పరీక్ష లేకుండానే భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank Of India) 444 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఎస్‌బీఐ పలు రకాల పోస్టులకు నోటిఫికేషన్(SBI SO Notification 2020) జారీ చేసింది. జులై 13వ తేదీలోగా ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/careers మరియు https://bank.sbi/careers లో లాగిన్ అయ్యి సంబంధిత పోస్టుల(SBI Recruitment 2020)కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభ్యర్థులు ఎస్‌బీఐ కెరీర్స్‌లోకి వెళ్లి విద్యార్హత, రెజ్యుమ్, వయసు ధ్రువీకరణ పత్రం, జాబ్ ఎక్స్‌పీరియన్స్ సహా పలు డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి స్పెషలిటస్ట్ ఆఫీసర్లలో తాము పనిచేయాలనుకుంటున్న విభాగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 13వ తేదీతో దరఖాస్తుల తుది గడువు ముగియనుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి


కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్ష నిర్వహించకుండా ఎస్‌బీఐ కమిటీ మెరిట్, అనుభవం, పలు అంశాల ఆధారంగా కొందరు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అనంతరం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్‌ అభ్యర్థుల జాబితాను బ్యాంకు నిర్ణయించి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల(SBI Specialist Officer Recruitment 2020)ను భర్తీ చేస్తుంది. అభ్యర్థులకు కటాఫ్ మార్కులు సరిగ్గా సమానంగా వస్తే వయసు ప్రామాణికంగా అభ్యర్థిని SBI Jobsకి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సెట్‌ చూడండి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ