CRPF DIG Women Harassment: పోలీసు శాఖలో తీవ్ర దుమారం.. లైంగిక వేధింపులకు పాల్పడిన డీఐజీ..
CRPF DIG Women Harassment:సీఆర్‌పీఎఫ్‌కు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ర్యాంక్ అధికారి మహిళ సిబ్బందిని వేధింపులకు గురిచేశాడు. సదరు అధికారి ముంబయిలో విధులు నిర్వహిస్తున్న సమాచారం. ఘటనపై 15 రోజులలోగా వివరణ ఇవ్వాలంటూ పారామిలటరీ దళం ఉన్నతాధకారులు నోటీసులు జారీచేశారు.
Arjuna Awardee crpf dig khajan singh sexual harassed women: దేశంలో మహిళల భద్రత పెనుసవాల్ మారింది. మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చాయి. అయిన మహిళలపై దాడులకు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. ఇదిలా ఉండగా.. మహిళలు, బస్టాండ్ లు,రైల్వేస్టేషన్ లు,ఆఫీస్ లు ఇలా ప్రతిచోట కూడా వేధింపులకు గురౌతున్నారు. కొందరు మగాళ్లు మహిళలు, అమ్మాయిలు కన్పిస్తే చాలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని చోట్ల మహిళలు, తమ ఇంట్లో కూడా వేధింపులకు గురైన సంఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఇంట్లోవారు వేధింపులకు గురిచేయడం వంటి అనేక ఘటనలు పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వేధింపులు గురయ్యామని పోలీస్ స్టేషన్ లకు వెళ్లి ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా కొందరు ఖాకీచకులు వేధింపులు గురిచేసిన ఘటనలు కొకొల్లలు.
కొందరు పోలీసులు ఇలాంటి పనులు చేయడం వల్ల, అందరికి చెడ్డ పేరు వచ్చే విధంగా మారిపోయింది. కొన్ని చోట్ల ఉన్నతాధికారులు కూడా.. తమ తోటి మహిళ సిబ్బందిని వేధించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తమ కోరికలు తీర్చకుంటే.. వర్క్ విషయంలో ఇబ్బందులకు గురిచేసిన అనేక ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం ముంబాయిలో వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు..
ముంబైలో ఒక ఉన్నతాధికారి చేసిన పని పోలీసుశాఖకు తలవంపులు తెచ్చిపెట్టింది. దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళం ఉన్నతాధికారి కొన్నిరోజులుగా తోటి మహిళా సిబ్బందిని లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) ర్యాంక్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఖాజన్ సింగ్.. పారామిలటరీ ఫోర్స్‌లోని మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై అంతర్గతంగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఘటన గురించి వివరాలు సేకరించారు. ఘటనపై జరిగింది వాస్తవమేనంటూ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో.. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైన నేపథ్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఉన్నత శ్రేణి అధికారికి సర్వీసు నుంచి తొలగింపునకు నోటీసు అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మహిళల ఆరోపణల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ విచారణ జరిపి ఖాజన్ సింగ్ ను దోషిగా తేల్చింది. దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కి నివేదిక ఇచ్చింది. అతనిని విధుల నుంచి తొలగించాలని హోం మంత్రిత్వ శాఖను కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నిందితుడిపై.. సీఆర్‌పీఎఫ్ ద్వారా విచారణ జరిగింది. న్యాయ ప్రక్రియను అనుసరించి, చర్య తీసుకోవాని కూడా యూపీఎస్సీకి నివేదిక సమర్పించారు. ఇప్పుడు, అతనిని తొలగించాలని సిఫార్సు చేసింది. MHA (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ) కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది.. సీఆర్‌పీఎఫ్ అధికారికి తొలగింపు నోటీసును జారీ చేసిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. సీఆర్‌పీఎఫ్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ కాకముందు, అతను 1986 సియోల్ ఆసియా గేమ్స్‌లో 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది 1951 తర్వాత ఈవెంట్‌లో స్విమ్మింగ్‌లో భారతదేశానికి మొదటి పతకం.
ఖాజన్ సింగ్ ప్రస్తుతం.. రెండు అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఒక కేసులో తొలగింపు నోటీసు జారీ చేయబడింది. మరో కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం.. 3.25 లక్షల మంది సిబ్బందిని కలిగి ఉన్న CRPF, 1986లో మొదటిసారిగా మహిళలను ఈ దళంలో చేరే అవకాశం కల్పించారు. ఇందులో మొత్తం 8,000 మంది సిబ్బందితో ఆరు మహిళా బెటాలియన్లు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter