Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..

Pune man Quits Job: పూణేకు చెందిన ఒక సేల్స్ అసోసియేట్.. మూడేళ్లుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ అక్కడ అతను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. గుర్తింపు లేకపోవడం, శాలరీలో హైక్ కూడా ఇవ్వకపోవడం, అక్కడి పాలిటిక్స్ చూసి విసిగిపోయాడు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 26, 2024, 05:29 PM IST
  • వర్క్ ప్లేస్ లో టాక్సిక్ మనుషులు..
  • ఇలాంటి నీచపు బుద్ది మానుకోవాలంటూ నెటిజన్ల ఫైర్..
Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..

Pune man quits toxic job dances to dhol beats video goes viral: మనలో చాలా మంది వర్క్ ప్లేస్ లో రకారకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్నిచోట్ల ఉద్యోగులను లైంగికంగా వేధిస్తుంటారు. వర్క్ విషయంలో విపరీతంగా ప్రెషర్ ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొన్ని కంపెనీలలో కొందరు ఒక గ్రూపులుగా ఏర్పడి పోయి ఏళ్లుగా అక్కడే పాతుకుపోయి ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో వచ్చిన వారికి సరైన విధంగా ట్రైనింగ్ ఇవ్వరు. కంపెనీకి, కంపెనీకి కొన్నిసార్లు టెక్నికల్ గా కొన్ని తేడాలుంటాయి. దీంతో కొత్తగా వచ్చిన వారు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. వీరికి సరైన విధంగా గైడ్ చేయరు. అంతేకాకుండా.. కొత్తగా వచ్చిన వారికి మేమున్నాం.. వర్క్ ఈజీ అనేబదులు ఒక అభద్రత భావం కలిగేలా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఒక గ్రూపులుగా ఏర్పడి,రాజకీయాలు చేస్తు, తమకు వత్తాసు పలికితే.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. పోరపాటున ఎదురు తిరిగినట్లు మాట్లాడితే.. ఎక్కడ దొరుకుతారా.. అని చూస్తుంటారు. కొన్నిసార్లు కావాలని తప్పులలో ఇరికిస్తుంటారు. 

 

కానీ కొన్నిచోట్ల మాత్రమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగికి ఏదైన అనుకోని ఆపద వస్తే మేమున్నామని అండగా నిలిచిన ఘటనలు కొకొల్లలు. కానీ దీనికి భిన్నంగా కొన్ని చోట్ల వర్క్ ఎన్విరాన్ మెంట్ కాస్తంతా చిరాకు తెప్పించేదిగా ఉంటుంది. అక్కడ పనిచేసే సీనియర్స్ చెప్పిందే వినాలి... అలా కాదంటే మన గురించి బాస్ కు నెగెటివ్ గా ఫీడ్ ఇస్తారు. దీంతో చివరకు ఎంప్లాయ్ తీవ్రంగా ఒత్తిడికి గురౌతాడు. కొన్నిచోట్ల కావాలని ఎంప్లాయ్ లకు హైక్ ఇవ్వకపోవడం, పని ప్రదేశంలోవేధించడం చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది..

పూర్తి వివరాలు..

పూణేకు చెందిన అనికేత్ అనే యువకుడు స్థానికంగా ఒక కంపెనీలో సెల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతను గత మూడేళ్లుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అనికేత్ ఎంత కష్టపడిన ఆ కంపెనీలో మాత్రం గుర్తింపు లేదు. హైక్ కూడా మూడేళ్లుగా ఇవ్వలేదు. దీంతో తన ఆర్థిక పరిస్థితుల మూలంగా అతను జాబ్ ను వదిలేశాడు. అయితే.. అతని ఫ్రెండ్స్ లాస్ట్ వర్కింగ్ డే రోజున అనికేత్ కు వెరైటీగా సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ లు చేశారు. ఈ క్రమంలోనే అనికేత్ ఆఫీస్ వద్దకు ఢోల్,బ్యాండ్ బాజా తో చేరుకున్నారు. అంతేకాకుండా.. బ్యాండ్ బాజాల మధ్య తీన్మార్ డ్యాన్స్ చేస్తూ తమ ఫ్రెండ్ ను టాక్సిక్ ఆఫీస్ నుంచి బైటకు పిలిచారు.

Read More: Spiderman Costume: స్పైడర్మ్యాన్ కాస్టూమ్స్ లో బైక్ మీద రొమాన్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్..

ఈ క్రమంలో అతని టాక్సిక్ కొలిగ్ ను కూడా బ్యాండ్ మోగిస్తు షాకింగ్ కు గురిచేశారు. ఈ రోజుతో తన కష్టాలు, టెన్షన్స్ దూరమైపోయాయంటూ అనికేత్ ఊపిరీపీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. మంచి ఐడియా బ్రో.. , మీకు మంచి జరుగుతుంది, కష్టపడే వాళ్లకు ఎక్కడైన మంచి జరుగుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వర్క్ ప్లేస్ లో కొందరు ఇలాంటి పనులు చేయడం వల్ల .. సున్నితమైన మనస్సులు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటారని మరికొందరు కామెంట్ లు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం మానండి బ్రో.. ఇది కరెక్ట్ కాదంటూ మరికొందరు అనికేత్ కు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News