MM Naravane: దేశపు కొత్త ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్‌గా, రెండవ అధిపతిగా జనరల్ ఎంఎం నరవణే బాధ్యతలు స్వీకరించారు. జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో జరిగిన ఘోర హెలీకాప్టర్ ప్రమాదంలో ఆర్మీ ఉన్నతాధికారులు బలయ్యారు. భారత ఆర్మీలో అత్యున్నత అధికారి ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఉన్న జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దేశపు తొలి సీడీఎస్ బిపిన్ రావత్(General Bipin Rawat). ఈయన హఠాన్మరణంతో సీడీఎస్ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. సీడీఎస్ ఛీఫ్‌గా బిపిన్ రావత్ ఉన్న సమయంలో త్రివిధ దళాలకు అధిపతిగా ఉన్న ఎంఎం నరవణేను కొత్త ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించారు. 


ప్రస్తుతం ఆర్మీ, వాయు, నేవీ మూడు విభాగాల్లో సీనియర్‌గా ఉన్న ఎంఎం నరవణేను(New CDS MM Naravane) ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దళాల ఛీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. త్రివిధ దళాల విషయంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(Chief of Defence Staff) నిర్ణయం తీసుకునే అధికారముంటుంది.ఈ పదవిని సృష్టించకముందు త్రివిధ దళాలకు ఛీఫ్‌గా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సీనియర్‌గా ఉన్న ఛీఫ్‌ని ఎన్నుకునేవారు. సీడీఎస్ ఛీఫ్‌గా నియమితులైన ఎంఎం నరవణే వెల్ డిసిప్లిన్డ్ అధికారిగా పేరుంది. 


Also read: Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత- 9 వేల దిగువకు యాక్టివ్​ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook