General Naravane: భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఆ స్థానాన్ని భర్తీ చేసే అధికారి ఎవరనే విషయంపై చర్చ సాగుతోంది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణె ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక మిస్సైల్ చేరింది. ఈ రోజు ఉదయం భారత నౌకాదళం (Navy) యాంటీషిప్ మిస్సైల్ (anti-ship missile) ను విజయవంతంగా పరీక్షించింది. కొర్వెట్టి ఐఎన్ఎస్ ప్రభల్ (INS Prabal ) నుంచి జరిపిన ఈ యాంటీ మిస్సైల్ ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత నావికాదళం ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
భారత నావికదళంలో మరో అత్యాధునిక యుద్ధనౌక వచ్చి చేరింది. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం సముద్రజలాల్లో యాంటీ సబ్మెరైన్ యుద్ధనౌక వచ్చి చేరడంతో ప్రత్యర్దులకు బలమైన హెచ్చరిక వెళ్లింది.
Rajnath Singh With Machine Gun | కేంద్ర రక్షణశాఖ మంత్రి సరిహద్దుల్లో పరిస్థిని సమీక్షించేందుకు శుక్రవారం ఉదయం లడఖ్ వెళ్లారు. అక్కడ ఆయనకు సైనికులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజులపాటు సరిహద్దుల్లో రాజ్నాథ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నారు.
దాయాది పాకిస్థాన్ హద్దులు మీరితే ఉపేక్షించేది లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. శాంతి ఒప్పందాలను అనుసరించి ఉంటున్నామని, అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.