Agnipath: అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్‌ ద్వారానే ఇకపై రిక్రూట్‌మెంట్ జరగుతుందని స్పష్టం చేసింది. ఈవిషయాన్ని మీడియా సమావేశంలో త్రివిధ దళాల అధికారులు తేల్చి చెప్పారు. ఇక సాధారణ రిక్రూట్‌మెంట్ ఉండదని తెలిపారు. అగ్నిపథ్‌ వల్ల యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈనెల 24 నుంచి అగ్నిపథ్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. జులై 24న అగ్నిపథ్‌ ఫేజ్‌-1 పరీక్ష జరుగుతుంది. డిసెంబర్‌ చివరి నాటికి అగ్నివీరులకు శిక్షణ ప్రారంభిస్తామని త్రివిధ దళాల అధికారులు స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అగ్నివీరులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందిస్తామని..వారు బయటకు వెళ్లిన నెలరోజుల్లోనే ఉపాధి చూసుకోగలరని చెప్పారు. సైన్యం తరపున అగ్నివీర్‌లకు అండగా ఉంటామన్నారు. అగ్నిపథ్‌ ద్వారా బయటకు వెళ్లే సమయంలో అగ్నివీరులంతా రూ.12 లక్షలు తీసుకుని బయటకు వెళ్తారని తెలిపారు. అగ్నివీరుల క్రెడిట్ రేటింగ్స్ బాగుంటే బ్యాంకులు సైతం రుణాలు ఇస్తాయని త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. 


అగ్నివీరుల రిటైర్మెంట్ తర్వాత వారికి ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల తర్వాత కొనసాగాలా..లేక వెళ్లిపోవాలా అన్నది వారి చేతుల్లో ఉందన్నారు. సర్వీసు తర్వాత డిప్లొమా ధృవపత్రం ఇస్తామన్నారు. దీని ద్వారా అనేక రంగాల్లో అవకాశాలు వస్తాయన్నారు. ఇండియర్ ఆర్మీలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణాలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 


ఇందులోభాగంగానే దీనిపై సమగ్ర అధ్యయనం చేశామని..వివిధ దేశాల సైన్యంపైనా ఆరా తీశామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయని..వాటిని నివృత్తి చేసేందుకే మీడియా ముందుకు వచ్చామని వెల్లడించారు. ప్రస్తుతం సాయుధ దళాల్లో ఉన్న వారి సగటు వయసు 30 ఏళ్లకు పైగా ఉందని..ఇలా కొనసాగడం ఆందోళనకరమన్నారు. యువకులైతే సైన్యంలో టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు.


Also read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు..మరో మూడు రోజులపాటు వర్ష సూచన..!


Also read: YS Sharmila: పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ.. అక్కడినుంచే ఎందుకో తెలుసా?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook