Sikkim Truck Accident: ఉత్తర సిక్కింలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు వీరమరణం పొందారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. శుక్రవార ఉత్తర సిక్కింలోని జెమాలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైందని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌కు 130 కి.మీ దూరంలో ఉన్న లాచెన్‌కు 15 కిలోమీటర్ల దగ్గరలోని జెమా 3 వద్ద ఉదయం 8 గంటలకు ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మొత్తం 16 మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ఆర్మీ సిబ్బంది పరిస్థితి ఇంకా తెలియరాలేదు.  ఈ ఘటనకు సబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జెమా వైపు సైనికులు వెళుతుండగా.. వాహనం ఒక పదునైన మలుపులో స్కిడ్ అయి కింద ఉన్న లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ టీమ్ అక్కడికి చేరుకుని సైనికులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. గాయపడిన నలుగురు సైనికులను విమానంలో తరలించారు.  ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ముగ్గురు జూనియర్‌ కమీషన్డ్‌ అధికారులు, 13 మంది సైనికులు అమరులయ్యారని భారత సైన్యం తెలిపింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర సిక్కిం చాలా ప్రమాదకరమైన ప్రాంతం కాగా.. ప్రస్తుతం మొత్తం మంచుతో నిండిపోయింది. 


 



 


ఈ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికుల సేవ, నిబద్ధతకు హృదయపూర్వక  దేశం కృతజ్ఞతలు తెలియజేస్తుందన్నారు. మృతుల కుటుంబాలు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.


Also Read: CCI Selector: బీసీసీఐ సెలక్షన్ కమిటీ కోసం సచిన్, సెహ్వాగ్, ధోనీ అప్లై.. ఇంజమామ్ కూడా! ఊహించని ట్విస్ట్  


Also Read: AP Police Recruitment 2022: ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook