AP Police Notification Latest Update: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో చాలామంది ఈ ఉద్యోగాల కోసం పోటీపడేందుకు అవకాశం లభిస్తుంది. పలు పోలీసు ఉద్యోగాల భర్తీచేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు వీటి భర్తీ కోసం పోలీస్‌శాఖ అక్టోబరు 20న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, 411 ఎస్పై పోస్టులు ఉన్నాయి. వయోపరితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ అభ్యర్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో పోలీసు డిపార్ట్మెంట్‌లోని భారీగా ఖాళీలు ఉన్న నేపథ్యంలో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కొద్ది నెలలుగా కసరత్తు చేస్తోంది. గత నెలలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కోసం ఏపీ డీజీపీ ప్రభుత్వాన్ని అనుమతి కూడా కోరారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీస్ రీక్రూమెంట్ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 22న కానిస్టేబుల్ అభ్యర్థులకు, ఫిబ్రవరి 19వ తేదీన సబ్ ఇన్‌స్పెక్టర్ అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో పోలీసు శాఖలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరగడం.. కొన్ని పోస్టులకు ప్రమోషన్లు ఇస్తూ ఉండడంతోపాటు సర్వీస్‌లో కొందరు పోలీసులు మరణించడంతో భారీ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలకు తోడు పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా అమలు చేస్తుండడంతో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. దీంతో తక్షణమే కొత్త పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పోలీస్ నోటిఫికేషన్‌పై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. కొందరు వయో పరిమితి అప్లై చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కలిసి వయో పరిమితి పెంచాలని కోరారు. వీరి విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి ప్రారంభం నాటికి పోలీసు శాఖలో పోస్టింగ్ ఇవ్వనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook