ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో  మరోసారి ఢిల్లీ పీఠాన్ని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్  ఆద్మీ పార్టీ దక్కించుకున్నట్లయింది. ఐతే తుది ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ  వస్తున్న ఆధిక్యాన్ని బట్టి  ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖరారైనట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రజలు 'మఫ్లర్ వాలా ఫిర్ మార్ దియా' అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181920","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అటు పూర్తి ఫలితాలు ఖరారు కాకముందే  ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం సంబరాలకు సై అన్నారు. పార్టీ సాధించిన ఘన విజయాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సతీమణి సునీతతో కలిసి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా కేక్ కూడా కట్ చేశారు. భార్య సునీతకు కేక్ తినిపించారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు కూడా కావడం విశేషం. పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .. ఆమెకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్లుగా .. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.