Arvind Kejriwal Bail: అనూహ్యంగా మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్‌ లభించింది. రూ.లక్ష పూచీకత్తుతో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు మధ్యంతర బెయిల్‌ సుప్రీంకోర్టు ఇవ్వగా ఇప్పుడు కింది స్థాయి కోర్టు సాధారణ బెయిల్‌ ఇవ్వడం గమనార్హం. కాగా ఇదే కేసులో అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్‌ వస్తుందా రాదా? అనేది ఆసక్తికరంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: UGC NET Cancel: కేంద్రం సంచలన నిర్ణయం.. అవకతవకలతో యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు


ఢిల్లీ మద్యం విధానం అవకతవకల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 15 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం అనంతరం తిరిగి కేజ్రీవాల్‌ జైలులో లొంగిపోయారు. అయితే రెగ్యులర్‌ బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కింది స్థాయి కోర్టులో చూసుకోమని ఆదేశించింది. దీంతో రౌస్‌ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ బెయిల్‌పై బుధ, గురువారాల్లో సుదీర్ఘ విచారణ చేసింది. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌ చేయగా.. గురువారం వెకేషన్‌ జడ్జి నియాయ్‌ బిందు బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి ఘోర అవమానం.. కాన్వాయ్‌పై చెప్పుల దాడి


అయితే బెయిల్‌పై వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. మద్యం విధానంలో కేజ్రీవాల్‌ లంచంగా రూ.వంద కోట్లు డిమాండ్‌ చేశారని ఈడీ తరఫున వాదించారు. లంచం అడిగినందుకే నిందితుల జాబితాలో అతడి పేరు చేర్చిచినట్లు వివరణ ఇచ్చింది. రూ.వంద కోట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీకి నిధుల రూపంలో ఇవ్వాలని కేజ్రీవాల్‌ అడిగినట్లు వివరించింది. సౌత్‌ గ్రూప్‌ను లంచం డిమాండ్‌ చేయగా.. హవాలా రూపంలో ఆ డబ్బు గోవాకు చేరిందని ఈడీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యాయవాదులు ఖండించారు.


సంబరాలు
తమ పార్టీ అధినేతకు బెయిల్‌ లభించడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆప్‌ కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిశీ స్పందిస్తూ.. 'సత్యమే గెలిచింది' అని ప్రకటించారు. 'సత్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు రావొచ్చు. కానీ ఓటమి మాత్రం ఉండదు' అని పేర్కొన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా హర్షం వ్యక్తం చేశారు. బెయిల్‌ లభించడంతో ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆప్‌ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.


మరి కవితకు బెయిల్‌ ఏది..?
ఢిల్లీ మద్యం విధానం కేసులోనే తెలంగాణ నాయకురాలు కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరవింద్‌ కేజ్రీవాల్‌ కన్నా ముందే కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆమె అరెస్టయ్యి దాదాపు నాలుగు నెలలు దాటుతోంది. కానీ ఇప్పటివరకు బెయిల్‌ రాకపోవడం గమనార్హం. కనీసం మధ్యంతర బెయిల్‌ కూడా దక్కలేదు. బెయిల్‌ కోసం కవిత న్యాయవాదులు తీవ్ర కృషి చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ విభాగం కూడా శ్రమిస్తోంది. విచారణకు సహకరిస్తానని చెబుతున్నా కూడా బెయిల్‌ రాకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తోంది. మరి ఒక మహిళగా కూడా కవితను బెయిల్‌ లభించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter