Arvind Kejriwal Health: మద్యం విధానంలో అవతవకల కేసులో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కస్టడీ (ఈడీ)లో ఉన్న కేజ్రీవాల్‌ ఆరోగ్యం బాగా లేదని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు కస్టడీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆప్‌ వర్గాలు తెలిపాయి. ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్‌ భారీగా తగ్గిపోయాయని ఆందోళన చెందుతున్నాయి. కొన్ని రోజులుగా అతడి ఆరోగ్యం బాగా లేదని ఆప్‌ తెలిపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌


 


'చక్కెర స్థాయిల్లో (షుగర్‌ లెవల్స్) తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒకానొక దశలో షుగర్‌ లెవల్‌ 46 ఎంజీ స్థాయికి పడిపోయింది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు' అని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత కూడా వీడియో సందేశంలో తెలిపింది. 'ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసినప్పుడు షుగర్‌ లెవల్స్‌ పడిపోతున్నాయని తెలిసింది. ఆయన ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని ప్రార్థిద్దాం' అని సునీత తెలిపారు.

Also Read: Lok Sabha Elections: ప్రధాని మోదీని ఇంటికి పంపించే దాకా నిద్రపోం: సీఎం కొడుకు తీవ్ర వ్యాఖ్యలు

మద్యం కుంభకోణం కేసులో మార్చి 21వ తేదీన అరెస్ట్‌ చేసిన ఈడీ అరవింద్‌ కేజ్రీవాల్‌కు మార్చి 28వ తేదీ వరకు కస్టడీ ఉంది. కస్టడీ ముగుస్తుండడంతో కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే తన అరెస్ట్‌పై కేజ్రీవాల్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే కేసులో ఆప్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook