Arvind Kejriwal: చీపురుకు ఓటు వేస్తే నేను జైలుకెళ్లాల్సిన అవసరం లేదు
Vote For AAP I Wont Have Go Back To Jail Says Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలకు ఎంతో మేలు చేయడం తాను చేసిన తప్పా అని ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అత్యధిక స్థానాల్లో ఆప్‌ను గెలిపిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు.
Arvind Kejriwal: లోక్‌సభ ఎన్నికల ఆఖరి నిమిషంలో బెయిల్‌పై వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. జైలుకెళ్లడంతో నిరాశకు గురయిన ఆప్ శ్రేణుల్లో జోష్ నింపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆప్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 'చీపురు' గుర్తుకు ఓటు వేస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆప్ అత్యధిక ఎంపీ స్థానాలు సాధిస్తే బీజేపీలో వణుకు మొదలవుతుందని తెలిపారు.
Also Read: Fake Video Case: కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఫేక్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్?
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఢిల్లీలోని మోతీనగర్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్యటించారు. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను 20 రోజుల తర్వాత జైలుకు వెళ్లాలి. అదే మీరందరూ చీపురు గుర్తుకు ఓటు వేస్తే నేను జైలుకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు' అని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 'ఢిల్లీలో స్కూళ్లు కట్టడమే నేను చేసిన తప్పు. ఆ పని చేసినందుకే నన్ను జైలుకు పంపారు. ఢిల్లీ ప్రజలకు ఏమీ చేయని బీజేపీకి మీరు బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు.
Also Read: Pothina Mahesh: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పెళ్లాలు ప్రచారం చేయరా? ఛీ నా బతుకు చెడ
'నేను జైలులో ఉన్న 15 రోజుల్లో ప్రజలకు ఎలాంటి మందులు, వైద్య సదుపాయాలు అందలేదు. కనీసం మధుమేహం మందులు కూడా ఇవ్వలేదు. నేను ఇన్సులిన్ కూడా పొందలేకపోయా' అని అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. 'నేను మళ్లీ జైలుకు వెళ్లితే మాత్రం బీజేపీ అన్ని పనులు ఆపేస్తుంది. ఉచిత విద్యుత్, స్కూళ్ల నిర్మాణం, ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తారు' అని హెచ్చరించారు. ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారా అని ప్రశ్నించగా తాను లేనని కేజ్రీవాల్ ప్రకటించారు.
'ఇండియా కూటమి అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన 10 గ్యారంటీలను కూడా అమలుచేస్తాం. నేను ప్రకటించిన పది హామీలు నవ భారతదేశానికి ఒక విజన్, వీటిలో కొన్ని పనులను 75 ఏళ్లలోనే చేయాల్సినవి. కానీ ఎవరూ చేయలేకపోయారు' అని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మోదీ హామీలను నమ్మాలా? కేజ్రీవాల్ హామీలను నమ్మలా? అనేది ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. గతంలో తామిచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి 20 రోజులు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహం రచించారు. మే 25f వ తేదీన ఆరో దశలో పోలింగ్ జరగనుంది. అనంతరం జూన్ 2వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter