Aryan Khan Drugs Case: బాలీవుడ్ ను కలవరానికి గురిచేసిన ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో కీలక విట్ నెస్ ప్రభాకర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో ప్రభాకర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అతడి తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. అయితే ప్రభాకర్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు ఎవరూ అనుమానం వ్యక్తం చేయలేదని న్యాయవాది తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసు


గతేడాది అక్టోబరులో ముంబయి నగర తీరప్రాంతంలోని ఓ క్రూయిజ్ షిప్ లో జరుగుతోన్న రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కొందర్ని సాక్షులుగా ఎన్సీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. వారిలో ప్రభాకర్ సెయిల్ కూడా ఒకరు. కేసు విచారణలో భాగంగా అతడిని కూడా ఎన్సీబీ అధికారులు విచారించారు. 


ఈ ప్రభాకర్ సెయిల్.. ప్రైవేట్ డిటెక్టివ్ గోసవి బాడీగార్డ్ గా పనిచేస్తుండేవాడు. అయితే అప్పట్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.  డ్రగ్స్ కేసులో గోసవి, ఎన్సీబీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రభాకర్ అప్పట్లో మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో అతడి ప్రాణానికి వాంఖడే నుంచి హానీ ఉందని స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబర్ లో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్.. మూడు వారాల తర్వాత జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.    


Also Read: Paytm: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..ఇక నుంచి చేతిల్లో డబ్బుల్లేకపోయినా టికెట్లు బుక్ చేసుకోవచ్చు


Also Read: Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ సీఎం నితీష్ కుమార్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook