Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ సీఎం నితీష్ కుమార్!

Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుండడం వల్ల ఆయన స్థానంలో నితీష్ కుమార్ ను ఎన్నిక కానున్నారని తెలుస్తోంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 10:10 AM IST
Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ సీఎం నితీష్ కుమార్!

Nitish Kumar Vice President: భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం త్వరలోనే పూర్తి కానుంది. ఈ క్రమంలో ఆ స్థానంలో తదుపరి ఎవరు వస్తారనే విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
ఇప్పటికే అనేక జాతీయ మీడియా సంస్థలు నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని కథనాలు వెలువరించాయి. దీంతో ఈ విషయంపై మరింత చర్చ జరుగుతుంది.

ఒకవేళ బిహార్ సీఎం ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అయితే ఆ రాష్ట్రం నుంచి నాలుగు సభలకు ప్రాతినిధ్యం వహించిన నాలుగో రాజకీయ నాయకుడిగా నితీష్ నిలిచిపోతారు. లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీ, నాగమణి కుశ్వాహా తర్వాత నాలుగు సభలు అంటే బిహార్ శాసనసభ, బిహార్ శాసనమండలి, లోక్ సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహించిన బిహార్ నేతగా నితీష్ కుమార్ ఘనత సాధిస్తారు.  

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ త్వరలోనే ఉపరాష్ట్రపతిగా ఎన్నికవ్వబోతున్నారనే ఊహాగానాలపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ స్పందించారు. నితీష్ రాజ్యసభకు వెళ్లాలని తమ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. నితీష్ కుమార్ కూడా ఇటీవలే ఓ అనధికారిక మీటింగ్ లో రాజ్యసభ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.  

Also Read: Fact check: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాబోతున్నారా? వైరల్ అవుతున్న వార్తపై జీ తెలుగు న్యూస్‌ ఫ్యాక్ట్‌ చెక్‌

Also Read: Birbhum Violence: రణరంగంగా మారిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ.. నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News