Amit Shah To Be PM: బీజేపీలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ హవా నడుస్తోంది. మోడీ ఛరిష్మాతో కేంద్రంలో క్లియర్ మెజార్టీతో వరుసగా రెండో సారి అధికారం అనుభవిస్తోంది ఆ పార్టీ. పాలనతో పాటు పార్టీలోనూ మోడీ మాటే వేద వాక్కు. ఆయన ఏం చెబితే అదే ఫైనల్. మోడీ తర్వాత అంతటి పార్టీలో అంతటి చరిష్మా ఉన్న నేత హోంమంత్రి అమిత్‌షా. పార్టీ అధ్యక్ష పదవిని నడ్డాకు అప్పగించినా.. ఇప్పటికీ అనధికారికంగా ఆయనే హైకమాండ్. రాష్ట్రాల్లో పాలన విషయంలో గానీ, పొత్తులు, అధికారంలోకి రావడానికి వ్యూహాలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. అమిత్ షా ఏ రాష్ట్రంపైనా గట్టిగా ఫోకస్ పెట్టాడంటే అక్కడున్న విపక్షపార్టీల పాలకులకు హడలే. వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్న షా... ప్లాన్ వేశారంటే ఇక తిరుగుండదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ లో ఉన్నప్పటి నుంచి ఆత్మీయులుగా,ఆప్తులుగా కొనసాగుతున్నారు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా ఇద్దరూ ఎంతో కృషిచేశారు. గత ఎనమిదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న మోడీ నేతృత్వంలోనే వచ్చే సారి కూడా బీజేపీ ఎన్నికలకు వెళ్తుందనేది ఇప్పటివరకు ఉన్న మాట. కానీ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బీజేపీ నేతలతో పాటు విపక్ష పార్టీలు కూడా అవాక్కయ్యాయి.


అసోంలో ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. ప్రధాని అమిత్‌షా, హోంమంత్రి నరేంద్ర మోడీ అని సంబోధించారు. ఈ మాటలు పొరపాటున వచ్చాయో లేదంటే ఆయన మనసులో మాట బయటపెట్టారో కానీ .. ఇప్పుడీ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. బీజేపీతో పాటు విపక్షపార్టీల నేతలూ ఇప్పుడు అసోం సీఎం వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు.




హిమంత బిశ్వ శర్మ పొరపాటున మాట జారారని... ఉద్దేశపూర్వకంగా పేర్లు మార్చలేదంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ మాటల వెనక మర్మం చాలా ఉందని పోస్టులు చేస్తోంది. బీజేపీ తర్వాతి ప్రధానిగా అమిత్‌షాను ఎంచుకుందని అందుకే హిమంత బిశ్వ శర్మ ఈ కామెంట్లు చేశారని అంటోంది. గతంలో అసోం సీఎం విషయంలోనూ ఇలాగే జరిగిందని చెబుతోంది. గత అసోం ఎన్నికలకంటే ముందు హిమంత బిశ్వ శర్మను.. బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్... సీఎం అంటూ సంబోధించేవారు. అయితే అప్పుడు సీఎంగా ఉన్నది శర్భానంద సోనోవాల్. ఎంపీ లోచన్ దాస్ చెప్పినట్లే ఎన్నికల తర్వాత హిమంత బిశ్వ శర్మ సీఎం అయ్యారు. ఇప్పుడు అదే వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రిపీట్ అయ్యే అవకాశం ఉందంటోంది కాంగ్రెస్ పార్టీ. 


 


 


also read: Uttarakhand Cm in ByPoll: ధామి కోసం ఉత్తరాఖండ్‌కు యోగి ఆదిత్యనాథ్.. రంగంలోకి 40 మంది


also read: Yashwant Sinha Comments: అన్ని మతాల్ని నిషేధించి..హిందూ దేశంగా ప్రకటించేయండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.