Assam elections: కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే..సీఏఏ నిలిపివేత, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
Assam elections: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరోసారి పౌరసత్వ సవరణ చట్టం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సీఏఏను నిలిపివేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. అసోం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తోంది.
Assam elections: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరోసారి పౌరసత్వ సవరణ చట్టం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సీఏఏను నిలిపివేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. అసోం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తోంది.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌తో పాటు అసోం రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు ( Assam Elections)జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అసోం రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా రెండవ రోజు తేజ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ( Priyanka gandhi) పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రాష్ట్రంలో సీఏఏ( CAA)ను నిలిపివేస్తామని ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో పలు హామీలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో వస్తే..నెలకు 2 వందల యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 2 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు.
ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో తేయాకు మహిళా కార్మికుల దినసరి వేతనం పెరగడం లేదని ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తేయాకు మహిళా కార్మికులకు దినసరి వేతనం 365 రూపాలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ( Five lakh government jobs)కల్పిస్తామని చెప్పారు. అసోం మహిళల భవిష్యత్‌కు ఈ ఎన్నికలు చాలా కీలకమని అభివర్ణించారు. అసోంలో మహిళలపై చాలా దాడులు జరుగుతున్నాయని.. ప్రస్తుత ప్రభుత్వం మహిళల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. అసోం రాష్ట్రంలోని 126 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Also read: Coronavirus: కరోనా బారిన పడి..మధ్య ప్రదేశ్ బీజేపీ ఎంపీ నందకుమార్ చౌహాన్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook