Coronavirus: కరోనా వైరస్ మళ్లీ ప్రతాపం చూపిస్తోందా..కరోనా కేసులే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు కన్పిస్తోంది. కరోనా వైరస్ మరో ప్రజా ప్రతినిధిని బలి తీసుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి బీజేపీ ఎంపీ మృతి చెందారు.
దేశంలో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్(Coronavirus)కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాలు అప్రమత్తత వహించి..ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో విషాదకర వార్త నెలకొంది. కరోనా వైరస్ మరో ప్రజా ప్రతినిధిని బలి తీసుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి బీజేపీ ఎంపీ మృతి చెందారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఖాండ్వా లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ ( Bjp mp nandkumar singh chauhan) తుది శ్వాస విడిచారు. ఈయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం కన్నుమూశారు.
ఎంపీ నందకుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ( Pm narendra modi) తీవ్ర సంతాపం ప్రకటించారు. పార్టీకు ఆయన లేని లోటు తీరనిదని ట్వీట్ చేశారు. పార్టీ బలోపేతం కోసం చేసిన కృషి మరువలేనిదని వ్యాఖ్యానించారు. నందకుమార్ మృతితో బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగారు. 2009-14 మినహాయించి 1996 నుంచి చౌహాన్ లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook