Girl Education : బాలికల విద్యాభ్యాసం విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. బాగా చదివి మెరిట్ సాధించే విద్యార్థినులకు స్కూటీలు అందించాలి అని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంతా బిస్వా శర్మ ఒక ప్రకటన విడుదల చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lowest temperature: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత..వణికిస్తున్న చలిగాలులు


హైయ్యర్ సెకండరీ పరీక్షల్లో మెరిట్ సాధించిన స్టూడెంట్స్‌కు కానుకగా ప్రోత్సాహకంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు మొత్తం 22,250 స్కూటీలను విద్యార్థినులకు (Girl Students) ఉచితంగా అందించనున్నట్టు విద్యాశాఖ మంత్రి వివరించారు.


అస్సాం హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 2020 నిర్వహించిన పరీక్షల్లో బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు.  కాలేజీ విద్యాభ్యాసాన్ని (Education) ప్రోత్సాహించడానికి, కళాశాల వెళ్లిరావడానికి అనుకూలంగా వారికి ఈ స్కూటీలను అందిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


Also Read: Punjab సీఎంను చంపుతామంటూ పోస్టర్.. కేసు నమోదు


ఈ పథకం కోసం ఇప్పటికీ ప్రభుత్వం రూ.144 కోట్లు ఖర్చు పెట్టింది. అమ్మాయిల చదువు కోసం తల్లీదండ్రులతో సమానంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అస్సాం ఆర్థిక మంత్రి తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook