'కరోనా వైరస్' శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో  ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఎక్కువగా లక్షణాలు లేని కరోనా పాజిటివ్ కేసులు ఉంటున్నాయి. మరోవైపు తక్కువ లక్షణాలు కనిపించే కేసులు సైతం వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో రోగులను గుర్తించి ఆస్పత్రికి తరలించడం.. పైగా ఆస్పత్రులన్నీ కరోనా వైరస్ రోగులతో నిండి ఉన్న క్రమంలో కొత్త నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నుంచి కరోనా లక్షణాలు ఉన్న రోగులకైనా.. లేదా లక్షణాలు కనిపించని రోగులకైనా ఇంటి వద్దే చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రోగులకు ఇంటి వద్దే 14 రోజుల క్వారంటైన్ ఏర్పాటు చేస్తారు. రోగులు ఎలా ఉండాలి..? అనే విషయాలను వైద్య సిబ్బంది సూచిస్తారు. అంతే కాదు ప్రతి రోజూ వారిని పరిశీలించి మందులు అందిస్తారు. దీని వల్ల ఎవరి ఇంట్లో వారికే కరోనా వైరస్ తగ్గిపోతుందని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. అంతే కాకుండా కరోనా వ్యాప్తికి కూడా అడ్డుకట్టవేయవచ్చన్నారు.


[[{"fid":"184970","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..