CBSE: వచ్చేవారమే సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు
సీబీఎస్ఈ ( CBSE ) బోర్డు పరీక్షల ఫలితాల విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 10, 12 వ తరగతి పరీక్షల ఫలితాల్ని వచ్చేవారం విడుదల చేయనున్నారు. సీబీఎస్ఈ కు సంబంధించిన పలు అంశాలపై మానవ వనరుల అభివృద్ధి శాఖ ( MHRD ) వివరణ కూడా ఇచ్చింది.
సీబీఎస్ఈ ( CBSE ) బోర్డు పరీక్షల ఫలితాల విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 10, 12 వ తరగతి పరీక్షల ఫలితాల్ని వచ్చేవారం విడుదల చేయనున్నారు. సీబీఎస్ఈ కు సంబంధించిన పలు అంశాలపై మానవ వనరుల అభివృద్ధి శాఖ ( MHRD ) వివరణ కూడా ఇచ్చింది.
దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాలు ( CBSE BOARD RESULTS ) విడుదల కానున్నాయి. దీనికోసం సీబీఎస్ ఈ బోర్డు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. సీబీఎస్ఈ పదవ తరగతి, పన్నెండవ తరగతి పరీక్షల ఫలితాల్ని జూలై 15లోగా విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల్ని సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in, cbse.nic.in లో చెక్ చేసుకోవచ్చని బోర్డు ప్రకటించింది. Also read: NIFT Recruitment 2020: ఎన్ఐఎఫ్‌టిలో పలు పోస్టులకు నోటిఫికేషన్
మరోవైపు సీబీఎస్ఈ సిలబస్ లో కోతపై మానవ వనరుల శాఖ మంత్రి ( Human resources development minister Ramesh Pokhriyal ) రమేష్ పోఖ్రియాల్ వివరణ ఇచ్చారు. ట్వీట్ ద్వారా ఆయన ఈ అంశంపై వ్యాఖ్యలు చేశారు. సీబీఎస్ఈ సిలబస్ తగ్గింపు విషయంలో ప్రజలు అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. ఇంటర్నల్ ఎసెస్ మెంట్ ప్రక్రియ ఆధారంగా బోర్డు పరిణామాలుంటాయని అన్నారు. కోవిడ్ 19 సంక్రమణ నేపధ్యంలో చదువు నష్టం కలగకుండా 9 నుంచి 12 వ తరగతి వరకూ 30 శాతం సిలబస్ తగ్గిస్తూ వెబ్ సైట్ పై పొందుపర్చడం గమనార్హం. Also read: Covid19: కరోనా వైరస్ సంక్రమణపై కేంద్ర కీలక ప్రకటన
అటు కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని జేఈఈ ( JEE ) , నీట్ ( NEET ) సిలబస్ లో కూడా కోత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు పరీక్షలు ఈసారి సెప్టెంబర్ నెలలో ఉండవచ్చని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..