Ayodhya Bhakti Path and Ram Path installed Lights Stolen FIR Filed: అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంతో వేడుకగా జరిగింది. ఐదువందల ఏళ్లనాటి కల దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. ఈ వేడుకకు మనదేశంనుంచి సామాన్యులతో పాటు,  అన్నిరంగాలకు చెందిన  ప్రముఖులు హజరయ్యారు. అందరికి రామజన్మభూమి ఆలయం ట్రస్ట్ ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఆలయం పరిసర ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఇదిలా ఉండగా.. అయోధ్యలో ప్రస్తుతం జరిగిన చోరీ అందరిని షాకింగ్ కు గురిచేస్తుంది. ముఖ్యంగా.. ఉత్తర ప్రదేశ్ లోని.. అయోధ్యలో సర్వాంగ సుందరంగా, కాంతులు వెదజల్లే ప్రత్యేకమైన లైట్లను ఏర్పాటు చేశారు. రామమందిరంకు దగ్గరలో ఉన్న.. భక్తిపథ్, రామ్‌ పథ్‌లో ఏర్పాటుచేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గురయినట్టు పోలీసులు గుర్తించారు.


వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని సమాచారం. మరోవైపు.. నిరంతరం భద్రత, హై సెక్యురిటీ ఉండే ప్రాంతంలో ఈ చోరీ జరగడంతో.. అధికారులు సైతం షాక్ కు గురౌతున్నారు. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని సమాచారం. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లోప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 9వ తేదీన కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు.


Read more: Electricity Bills: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు.. కీలక నిర్ణయం తీసుకున్న డిస్కమ్ అధికారులు..  


లైటింగ్ ఏర్పాటు చేస్తోన్న కాంట్రాక్ట్‌ సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రామ్‌‌పథ్‌లో దాదాపు 6,400 బ్యాంబూ లైట్లు, భక్తి పథ్‌లో 96 ప్రొజెక్టర్ లైట్స్ సెట్లను అమర్చారు. మార్చి 19వ తేదీ వరకూ ఉన్న ఇవి.. తర్వాత కనిపించకుండా పోయాయి. మే 9న అక్కడ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఈ లైట్లు కనిపించలేదు. మొత్తం 3,800 బిగ్ లైట్స్‌, 36 ప్రొజెక్టర్ లైట్స్‌ని దొంగిలించారు. మూడు నెలల కిందటే చోరీని గుర్తించినప్పటికీ ఆగస్టు 9వ తేదీన FIR నమోదుచేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter