Ayodhya: గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం
దీపావళి వేళ అయోధ్య అందంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే వెలుగులతో ప్రకాశవంతమైంది. సరయూ నది తీరాన నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
దీపావళి (Diwali ) వేళ అయోధ్య అందంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే వెలుగులతో ప్రకాశవంతమైంది. సరయూ నది తీరాన నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
అయోధ్య ( Ayodhya ) లో తొలి దీపావళి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వివాదాస్పద రామ జన్మభూమి ( Ram janmabhoomi ) అంశానికి తెరపడి..రామమందిర నిర్మాణానికి ( Ram mandir Construction ) భూమిపూజ పడిన తరువాత జరుపుకుంటున్న తొలి దీపావళి ఇది. అందుకే ఇంతటి ప్రాముఖ్యత. సరయూ నది తీరాన లేజర్ షో ద్వారా రాముడి చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించారు. మరోవైపు సరయూ నది తీరాన నిర్వహించిన దీపోత్సవం అద్భుత అనుభూతిని మిగిల్చింది. అంతేకాదు...ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
సరయూ నది తీరాన ( Saryu River Bank ) అయోధ్యలో దీపావళిని పురస్కరించుకుని ఏకంగా 5 లక్షల 84 వేల 572 ప్రమిదల్ని వెలిగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద దీపోత్సవంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ( Guinness Book of World Records ) కు ఎక్కింది ఈ ఈవెంట్. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Up cm yogi Adityanath ) లు అయోధ్యలో దీపావళి మహోత్సవాన్ని ప్రారంభించారు. దీపావళి పురస్కరించుకుని అయోధ్య నగరం సుందరంగా మారింది. దేశం నలుమూలల్నించి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. అయోధ్యలో ఇప్పుడు భక్తి పారవశ్యం అణువణువునా ప్రతిబింబిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Also read: Ayodhya: 5 లక్షల 51 వేల దీపాలతో వైభవోపేతంగా అయోధ్యలో తొలి దీపావళి