Ayodhya Diwali Celebrations: దీపావళి వేడుకల కోసం ముస్తాబైన అయోధ్యను చూశారా ?
Ayodhya Diwali Celebrations Timeline: దీపావళి వేడుక కోసం అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. శ్రీరాముడు నడయాడిన నేలపై దీపావళి సంబరాలు అంబరాన్నంటేలా వేడుకగా జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Ayodhya Diwali Celebrations Timeline: దీపావళి అంటేనే చీకట్లను చీల్చతూ మిరుమిట్లుగొలిపే దీపాల మధ్య ఆనందోత్సాహలతో వేడుకగా జరుపుకునే వెలుగుల పండగ. దీన్నే ఇంగ్లిష్‌లో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని అంటుంటాం కదా.. అందుకే అయోధ్య నగరం, సరయు నదితీరం కూడా మిరుమిట్లుగొలిపే దీపాల వెలుతురులో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి పండగ నాడు ఇలా దీపోత్సవ్ పేరిట భారీ ఎత్తున వేడుక జరుపుకోవడం ఇది ఆరోసారి. ఈ సారి దీపావళి పండగకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ దీపావళి వేడుకలకు హాజరవుతున్నారు.
దీపావళి రోజున అయోధ్య నగరంలో 15 లక్షలకుపైగా దీపాలు వెలిగించనున్నారు.
జిల్లా అధికర యంత్రాంగంతో కలిసి పర్యాటక రంగం, సాంస్కృతిక శాఖ వారు ఈ దీపోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నారు.
14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకున్న అనంతరం అయోధ్య రాముల వారు రాజ్యానికి తిరిగొచ్చిన ఘట్టం నేపథ్యంలో జరిగే పండగ కావడంతో అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి.
[[{"fid":"249376","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ayodhya-Diwali-2022-Celebrations-Timeline.jpg","field_file_image_title_text[und][0][value]":"Ayodhya-Diwali-2022-Celebrations-Timeline.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ayodhya-Diwali-2022-Celebrations-Timeline.jpg","field_file_image_title_text[und][0][value]":"Ayodhya-Diwali-2022-Celebrations-Timeline.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Ayodhya-Diwali-2022-Celebrations-Timeline.jpg","title":"Ayodhya-Diwali-2022-Celebrations-Timeline.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
సరయు నది ఒడ్డున 'రామ్ కి పైడి' పేరుతో జరగనున్న 3D హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు.
అక్టోబర్ 23న సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అయోధ్యలో నిర్మితమవుతోన్న రామ మందిరం స్థలాన్ని సందర్శించి అక్కడి పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని సమీక్షించనున్నారు.
సాయంత్రం 5.45 గంటలకు రాజ్యాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 6.30 గంటలకు సరయు నది ఒడ్డున నదికి హారతి ఇవ్వడంతో దీపోత్సవం వేడుకలు ప్రారంభమవుతాయి.
దీపావళి పండగ సందర్భంగా అయోధ్య సందర్శించే వారికి రామాయణంలోని కీలక ఘట్టాలను వివరించే విధంగా ప్రత్యేక బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అయోధ్య హైవే నుండి నయా ఘాట్ వరకు 30 పేర్లతో వివిధ స్వాగత ద్వారాలను అందంగా అలంకరించి ముస్తాబు చేశారు ( Ayodhya Deepotsav Photos ).
Also Read : Shukra Gochar 2022: దీపావళికి ముందు ఈ 5 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా మరి..
Also Read : Guru Margi 2022: దీపావళి తర్వాత ప్రత్యక్ష సంచారంలోకి గురుడు.. ఈ రాశులకు బంపర్ బెనిఫిట్స్...
Also Read : Rama Ekadashi 2022: ఈ రోజే రామ ఏకాదశి.. ఇలా విష్ణువును పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి