Modi in Ayodhya:  అయోధ్యలో సకల గుణాభిరాముడు కొలువుదీరిన వేళ ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఇలాంటి క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ట దేశ విశ్వాసానికి ప్రాణ ప్రతిష్టగా అభివర్ణించారు. అయోధ్య మందిర నిర్మాణానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ప్రధాని కృతజ్ణతలు తెలిపారు. నేటి ప్రత్యేకమైన రోజు అని, దేశమంతా రామజ్యోతి వెలగాలని పిలుపునిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని మోదీ ఇలా మాట్లాడారు.'పవిత్రమైన అయోధ్యకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల ద్వారా మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ కృతజ్ణతలు చెబుతున్నా. ఇది ఆలస్యం కావడం పట్ల రాముడికి క్షమాపణలు వేడుకుంటున్నా.22 జనవరి 2024 అనేది కేవలం తేదీ కాదు.కొత్త కాలచక్రానికి ప్రతీక. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. ఈ తేదీని కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు' అని తెలిపారు. 


'ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా ఎదురుచూశారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశాం. ఇన్నాళ్లకు మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈరోజు దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలి' అని తెలిపారు. దేశ విశ్వాసానికి ఇది ప్రాణ ప్రతిష్ట అని చెప్పారు. 'శతాబ్దాల నిరీక్షణ.. దశాబ్దాల కల. జన్మ భూమిలో జగధబి రాముడు. మన బాల రాముడు ఇక నుంచి టెంట్‌లో ఉండాల్సిన పనిలేదు. రామ్ లల్లా ఇక ఆలయంలో ఉంటాడు. ఇక నుంచి సరికొత్త కాల చక్రం. రాముడు వివాదం కాదు సమాధానం' అని పేర్కొన్నారు.

 



'ఇది సాధారణ మందిరం కాదు.. దేశ చైతన్యానికి ప్రతీక. భారత సర్వోన్నత అభివృద్ధికి ఇది చిహ్నం. కోట్లాది మంది రామ భక్తుల విశ్వాసం. రామ భక్తులంతా ఆనంద పారవశ్యంలో. దేశానికి ఆధారం, ఆదర్శం రాముడే. వందల ఏళ్లుగా ప్రజల నిరీక్షణ. ఈ శుభ ఘడియల కోసం 11 రోజుల దీక్ష చేశా. విలువలు, క్రమశిక్షణ శిరోధార్యం. రాముడే విశ్వం.. ఆయనే విఖ్యాత' అని ప్రధాని మోదీ తెలిపారు. దేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలమని చెప్పారు. వసుధైక కుటుంబం.. మన జీవన విధానం అని చాటిచెప్పారు. త్రేతా యుగం నుంచి ఇప్పటివరకు రాముడి ఆరాధన. రామ నామం ఈ దేశంలో కణం, కణంలో నిండి ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. 'రాముడే నిత్యం.. రాముడే నిరంతరం. ఆలయ నిర్మాణంతో పని పూర్తి కాలేదు. భవిష్యత్తులో అనేక విజయాలు సాధించాలి. ప్రతి కుటుంబానికి రామ రాజ్యం ఫలాలు అందాలి' అని పేర్కొన్నారు. 


రామాలయం ప్రారంభోత్సవం వేళ రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్లు వివరించారు. సాగర్‌ నుంచి సరయూ వరకు రామనామం జపించినట్లు చెప్పారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, కానీ చివరకు న్యాయమే గెలిచిందని తెలిపారు. ఇందుకు న్యాయ వ్యవస్థకు కృతజ్ణతలు తెలుపుతున్నట్లు చెప్పారు. 

Also Read: Ram Mandir Pullareddy: రామందిరం ప్రాణప్రతిష్టతో 'పుల్లారెడ్డి' ఆత్మకు శాంతి: కిషన్‌ రెడ్డి


Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook