Ram Mandir Darshan Timings Changed: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బాలరాముని ఆకారంలో కొలువు దీరిన రాముని విగ్రహాన్ని జనవరి 22వ తేదీ 2024 మద్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమై  12.31 గంటలకు ముగిసింది. మొత్తం కార్యక్రమం 86 సెకన్లు సాగింది.  బాలరాముని దర్శించుకోవడానికి అయోధ్య వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. ఇక పై దర్శన సమయాన్ని పెంచనున్నట్లు అయోధ్యం  అధికారిక వర్గాలు తెలిపాయి. అయోధ్య ఏర్పాటు నుంచి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అందుకే అయోధ్యం డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా భక్తులు దయచేసి 10, 15 రోజుల తర్వాతనే రావాలని విజ్ఞప్తి చేసింది. ఈనేపథ్యంలో దర్శన సమయాన్ని కూడా పెంచాలని దేవాలయ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి 10 గంటల వరకు కూడా రాముని భక్తులు అయోధ్యను దర్శించుకునే సౌలభ్యం కల్పించింది.


ఇది వరకు అయోధ్య రామమందిరం దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11.30 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండేది. అయితే, అయోధ్య రామమందిరం అధికార వర్గాల ప్రకారం ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మంది వరకు భక్తులు రాముని దర్శనానికి ఎదురు చూస్తున్నారు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. అందుకే ఈ సమయాన్ని పొడిగించినట్లు తెలుస్తోంది.


భక్తుల భద్రత పర్యవేక్షణ కోసం దాదాపు 8 వేలమంది పోలీసులు అయోధ్యలో పటిష్టభద్రతను ఏర్పాటు చేశారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)


ఇదీ చదవండి:  EPFO Balance Check: UAN నంబర్ తో సంబంధం లేకుండా ఇలా సింపుల్ గా పీఎఫ్‌ బ్యాలన్స్ చెక్ చేసుకోండి..


ఇదీ చదవండి: Budget 2024: నీలిరంగు చీరలో నిర్మలమ్మ.. ఇవి ఫైనాన్స్ మినిస్టర్ శారీ కలెక్షన్స్ ..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook